Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇంతకీ ఆ సినిమా ఏమైంది సుధీర్ బాబు?

ఇంతకీ ఆ సినిమా ఏమైంది సుధీర్ బాబు?

సుధీర్ బాబు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తను నిర్మాతగా మారానంటూ తన బ్యానర్ ను గ్రాండ్ గా లాంఛ్ చేశాడు ఈ హీరో. అయితే బ్యానర్ లాంఛ్ చేసే సమయానికే సొంతంగా డబ్బులు పెట్టి 2 సినిమాలు నిర్మించేశాడు. ఆ తర్వాతే బ్యానర్ పై ప్రకటన చేశాడు. అంతా బాగానే ఉంది. సుధీర్ బాబు పెట్టిన బ్యానర్ పై నన్నుదోచుకుందువటే సినిమా రిలీజైంది. రెండో సినిమా మాత్రం పత్తాలేకుండా పోయింది.

అవును.. నన్ను దోచుకుందువటే సినిమా విడుదల సమయానికే తన నిర్మాణంలో రెండో సినిమాను కూడా స్టార్ట్ చేశాడు సుధీర్ బాబు. ఆ సినిమాతో కూడా ఓ కొత్త దర్శకుడ్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నాడు. కానీ నన్ను దోచుకుందువటే ఫ్లాప్ అవ్వడంతో, తన నిర్మాణంలో చేస్తున్న రెండో సినిమాను మధ్యలోనే ఆపేసినట్టున్నాడు ఈ హీరో.

నిజానికి నన్ను దోచుకుందువటే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బిజినెస్ పరంగా సుధీర్ బాబు పెద్దగా నష్టాలు మాత్రం చవిచూడలేదు. పైగా శాటిలైట్ రైట్స్ కింద కోటి రూపాయలకు అమ్మేశాడు తొలి సినిమాని. మూవీ నిర్మాణ వ్యయం, రెవెన్యూ బ్యాలెన్స్ చేసుకుంటే.. సుధీర్ బాబుకు 40 నుంచి 50 లక్షల రూపాయల నష్టం మాత్రమే వచ్చిందట.

ఈమాత్రం నష్టాన్ని భరించడం సుధీర్ బాబు లాంటి సౌండ్ పార్టీకి పెద్ద కష్టమేంకాదు. అయినప్పటికీ తన బ్యానర్ పై చేస్తున్న రెండో సినిమాను ఈ హీరో ఎందుకు పక్కన పెట్టేశాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. సమ్మోహనం టైపులో మరో సక్సెస్ వస్తే, అప్పుడు ఈ సినిమాను తెరపైకి తీసుకొస్తాడేమో.

నాకు ఆవిడంటే చాలా ఇష్టం : వీరమాచినేని 

నాకు స్టామినా చాలా ఎక్కువ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?