విశాఖ నెత్తిన మరో పిడుగులాంటి వార్త. విశాఖ పరిసరాల్లోని పూడిమడక వద్ద నాలుగు వేల మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం ఎన్టీపీసీ ప్రయత్నాలు చేస్తుండగా, పర్యావరణ శాఖ ప్రాజెక్టుకు సదరు ప్రాంతం అనుకూలం కాదని తేల్చింది. ప్రతిపాదిత ప్రాంతం సునామీ తాకిడికి గురయ్యే అవకాశముందని పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. తీరానికి కేవలం వంద మీటర్ల దూరంలోనే ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం వుండడం అంత సేఫ్ కాదన్నది పర్యావరణ శాఖ వాదన.
ఇది కేవలం ఓ ప్రాజెక్టుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. విశాఖ ఎంత సేఫ్? అన్నదానిపై తలెత్తుతున్న ఆందోళనల్ని మరింత ఆందోళనకు గురిచేసే అంశమిది. ఇటీవలే విశాఖ నెత్తిన హుద్ హుద్ తుపాను పిడుగులా పడిరది. ఆ దెబ్బ నుంచి విశాఖ ఇంకా కోలుకోలేదు. అప్పటిదాకా, విశాఖ తుపాన్ల నుంచి పూర్తిగా సేఫ్ అని భావించేవారు విశాఖ వాసులు. ఎప్పుడైతే అత్యంత తీవ్రతతో హుద్ హుద్ తుపాను విరుచుకుపడిరదో, ఆ దెబ్బకి విశాఖ విలవిల్లాడిరది.
భారతదేశంలోని ఏ పెద్ద నగరమూ తుపాను దెబ్బకు ఇంతలా విలవిల్లాడినట్లు చరిత్రలో లేదు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక రాజధాని, ఐటీ రాజధాని అవుతుందనుకున్న విశాఖ హుద్‌హుద్ తుపానుతో అతలాకుతలమవడం సగటు విశాఖ వాసిని ఆవేదనకు గురిచేసింది. ఇంతలోనే పర్యావరణ శాఖ నుంచి ‘సునామీ భయం’ రావడం ఇంకా ఆందోళనకు గురిచేస్తోంది విశాఖ నగరాన్ని.
భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని.. పవర్ ప్లాంట్ గురించిన హెచ్చరిక మాత్రమే.. అని దీన్ని పరిగణించడానికి వీల్లేదు. సునామీలు చెప్పి రావు. జపాన్ లాంటి దేశమే సునామీకి విలవిల్లాడిరది. తీర ప్రాంత భద్రత విషయంలో రాజీ పడని దేశమది. అలాంటప్పుడు, విశాఖ విషయంలో పాలకులు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.?