వ్యాపారం కాదా? మంతెనగారూ?

ప్రకృతి చికిత్సాలయం పేరుతో వ్యాపారం చేయడం లేదని మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. కరకట్టపై తనది అక్రమ నిర్మాణం కాదని, అనుమతులు వున్నాయని, ఇతరత్రా అన్నీ చెప్పుకోచ్చారు. బాగానే వుంది మరి వ్యాపారం కాదని…

ప్రకృతి చికిత్సాలయం పేరుతో వ్యాపారం చేయడం లేదని మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. కరకట్టపై తనది అక్రమ నిర్మాణం కాదని, అనుమతులు వున్నాయని, ఇతరత్రా అన్నీ చెప్పుకోచ్చారు. బాగానే వుంది మరి వ్యాపారం కాదని అంటారేమిటి?

వ్యాపారం కాకుంటే, టీవీల్లో ప్రకటనలు ఎందుకు? 

వ్యాపారం కాకుంటే, ఎవరైనా తమ సమస్య చెప్పి, చేరదాం అనుకుంటున్నామంటే, ఇంత మొత్తం అని చెప్పి, బ్యాంకులో వేసి, ఆ రశీదు పట్టుకు రమ్మని చెప్పడం ఏమిటి? 

అక్కడ వివిధ ప్యాకేజీలు, వాటికి వేలల్లో ఖర్చు అన్నది వాస్తవం కాదా?

వ్యాపారం కాకుంటే ఫ్రీగా ఏమన్నా చేస్తున్నారా? ఎవరికన్నా ఫ్రీగా అవకాశం ఇస్తున్నారా?

అసలు అనుమతులు వున్నాయి అనడం వేరు. అనుమతులు ఎలా ఇచ్చారన్నది ఆరా తీయాలి. ఎందుకంటే ఈ వ్యవహారాన్ని కెలికింది సాదా సీదా వ్యక్తి కాదు..సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి. అందువల్ల నిజాలు వెలికి తీయాలి.