ఇకపై వాట్సాప్ లో గ్రూప్ వీడియో కాలింగ్

వాట్సాప్ కాలింగ్ అందరికీ తెలిసిందే. వాట్సాప్ వీడియో కాల్ కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు దీన్ని మరింత అభివృద్ధి చేసింది సదరు సంస్థ. వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.…

వాట్సాప్ కాలింగ్ అందరికీ తెలిసిందే. వాట్సాప్ వీడియో కాల్ కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు దీన్ని మరింత అభివృద్ధి చేసింది సదరు సంస్థ. వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గ్రూప్ వీడియో కాలింగ్ ద్వారా ఒకేసారి లైవ్ లో నలుగురు మాట్లాడుకోవచ్చు.

నిజానికి ఈ సౌకర్యాన్ని కిందటి ఏడాదే యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రామిస్ చేసింది వాట్సాప్. కానీ టెక్నికల్ అడ్డంకులతో పాటు చట్టపరమైన సమస్యల కారణంగా కాస్త లేటుగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది ఈ సౌకర్యం. లేటెస్ట్ వెర్షన్ ను అప్ డేట్ చేసుకునే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ వాట్సాప్ లో ఈ ఫీచర్ కనిపిస్తుంది.

అయితే ప్రస్తుతానికి ఈ గ్రూప్ వీడియో కాల్ లో నలుగురు మాత్రమే లైవ్ లో మాట్లాడుకునే ఛాన్స్ ఉంది. ఇందులో కూడా ఓ చిన్న పరిమితి ఉంది. ఇద్దరు వీడియో కాల్ లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు చెరొకర్ని మాత్రమే మరో వీడియో కాల్ ద్వారా యాడ్ చేయొచ్చు. అలా నలుగురు ఒకేసారి మాట్లాడుకోవచ్చు. 

రెగ్యులర్ వాట్సాప్ మెసేజీల్లానే ఈ వీడియో కాలింగ్స్ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్ట్ అయి ఉంటాయి. అంటే ఈ కాల్స్ అన్నీ అత్యంత సురక్షితమైనవని అర్థం.