విడుదలైన వారం రోజులకే శ్రీమంతుడు లైఫ్ టైమ్ గ్రాస్ ను భరత్ అనే నేను క్రాస్ చేసింది. ఓవర్సీస్ లో శ్రీమంతుడు సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డును ఈ సినిమా అధిగమించింది. పూర్తి రన్ లో శ్రీమంతుడు సినిమా 2.89 మిలియన్ డాలర్లు సాధిస్తే… శనివారం నాటి వసూళ్లతో భరత్ అనే నేను యూఎస్ వసూళ్లలో మరో స్థానం పైకి ఎగబాకింది.
ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో శ్రీమంతుడు సినిమా నిన్నటివరకు నాలుగో స్థానంలో ఉండేది. ఇప్పుడా స్థానాన్ని భరత్ ఆక్రమించాడు. మొన్నటికిమొన్న శ్రీమంతుడు సినిమాను రంగస్థలం అధిగమించి మూడో స్థానంలో నిలిస్తే.. ఇప్పుడు భరత్ అనే నేను సినిమా నాలుగోస్థానానికి వచ్చింది.
ఓవర్సీస్ కలెక్షన్లలో ఇప్పుడు రంగస్థలం, భరత్ అనే నేను మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. లైఫ్ టైం వసూళ్లలో మూడో స్థానంలో ఈ రెండు సినిమాల్లో ఏది నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
యూఎస్ బాక్సాఫీస్ లో టాప్-5 గ్రాసర్స్
1. బాహుబలి 2- 2,01,17,274 డాలర్లు
2. బాహుబలి – 69,97,636 డాలర్లు
3. రంగస్థలం – 34,30,342 డాలర్లు
4. భరత్ అనే నేను – 2.90 మిలియన్ డాలర్లు
5. శ్రీమంతుడు – 2,891,742 డాలర్లు