దుమ్ముదులుపుతున్న చిన్న సినిమా

విడుదలైనంతవరకు చిన్న సినిమా అన్నారు. కట్ చేస్తే ఇప్పుడదే మార్కెట్లో పెద్ద సినిమాగా మారింది. ఆర్ఎక్స్-100 జర్నీ ఇది. రిలీజ్ కు ముందు టీజర్, ట్రయిలర్ తో ఆసక్తిరేపిన ఈ సినిమా, విడుదలైన తర్వాత…

విడుదలైనంతవరకు చిన్న సినిమా అన్నారు. కట్ చేస్తే ఇప్పుడదే మార్కెట్లో పెద్ద సినిమాగా మారింది. ఆర్ఎక్స్-100 జర్నీ ఇది. రిలీజ్ కు ముందు టీజర్, ట్రయిలర్ తో ఆసక్తిరేపిన ఈ సినిమా, విడుదలైన తర్వాత వసూళ్లతో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రిలీజైన మొదటిరోజు నుంచి కాసుల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ, నిన్నటితో వారంరోజులు పూర్తిచేసుకుంది.

ఈవారం రోజుల్లో కళ్లుచెదిరే కలెక్షన్లు రాబట్టింది ఆర్ఎక్స్100 సినిమా. అటుఇటుగా 2కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వారం తిరిగేసరికి తెలుగు రాష్ట్రాల్లో 7కోట్ల 53లక్షల రూపాయల షేర్ రాబట్టింది. అంటే వారంరోజుల రన్ కే నాలుగింతల లాభం అన్నమాట.

సినిమాలో బోల్డ్ సన్నివేశాలతో పాటు ప్రీ-ఇంటర్వల్ నుంచి సెకెండాఫ్ ముగిసేవరకు వచ్చే ట్విస్టులు సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. అందుకే ఆర్ఎక్స్-100 సినిమా హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఇక ఏపీ, నైజాంలో ఈ సినిమాకు వారంరోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

ఆర్ఎక్స్-100 ఫస్ట్ వీక్ షేర్
నైజాం – రూ. 3,63,79,538
సీడెడ్ – రూ. 88,26,364
ఉత్తరాంధ్ర – రూ. 85,92,571
ఈస్ట్ – రూ. 58,54,445
వెస్ట్ – రూ. 43,92,657
గుంటూరు – రూ. 49,47,871
కృష్ణా – రూ. 46,96,883
నెల్లూరు – రూ. 17,08,947

7 రోజుల షేర్ – రూ. 7,53,99,276