Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శైలజారెడ్డిని సాగనంపిన మారుతి

శైలజారెడ్డిని సాగనంపిన మారుతి

మారుతి-నాగచైతన్య కాంబినేషన్ లో శైలజారెడ్డి అల్లుడు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలకపాత్రలో టైటిల్ పాత్రను రమ్యకృష్ణ పోషిస్తోంది. ఈ మేరకు రమ్యకృష్ణతో షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసింది యూనిట్. 

ఈ విషయాన్ని దర్శకుడు మారుతి స్వయంగా ప్రకటించాడు. నా ఎవర్ గ్రీన్ ఫేవరెట్ నటి రమ్యకృష్ణతో ఆఖరిరోజు షూటింగ్ అంటూ ట్వీట్ చేసిన మారుతి కొన్ని ఫొటోల్ని షేర్ చేశాడు. అందులో కూడా తనదైన మార్క్ చూపించాడు. కెమెరా డిపార్ట్ మెంట్ మొత్తానికి నల్లరంగు షర్టులు వేసి వాళ్లతో ఓ గ్రూప్ ఫొటో దిగాడు. తర్వాత తన డైరక్షన్ డిపార్ట్ మెంట్ మొత్తానికి తెల్లషర్టులు, లుంగీలు వేయించి వాళ్లతో మరో గ్రూప్ ఫొటోదిగాడు. ఈ రెండు ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు మారుతి. 

తాజా షెడ్యూల్ తో టోటల్ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేసింది. మరో వారంరోజుల షూట్ తో మూవీ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఈ సినిమా కోసం సవ్యసాచిని పక్కనపెట్టి మరీ, మారుతికి కాల్షీట్లు కేటాయించాడు నాగచైతన్య. 

అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రేయసి, అత్త ఇగోల మధ్య నలిగిపోయే కుర్రాడిలా నాగచైతన్య కనిపించబోతున్నాడు. వాళ్లను నాగచైతన్య ఎలా మార్చాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుంది. ఆగస్ట్ 31న థియేటర్లలోకి రానుంది శైలజారెడ్డి అల్లుడు చిత్రం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?