Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘చినబాబు’కు ఏమయింది?

‘చినబాబు’కు ఏమయింది?

తమిళ హీరో కార్తీకి ఇంతో అంతో మార్కెట్ వుంది తెలుగులో. ఇటీవల ఖాకీ సినిమా మంచి హిట్ అయింది కూడా. కానీ ఈవారం విడుదలయిన చినబాబు సినిమా మాత్రం గట్టిగా మూడుకోట్ల షేర్ వసూలు చేయలేకపోయింది. అలా అని సినిమా బాగాలేదా? అంటే కాస్త ఫరవాలేదు అనే టాక్ నే వచ్చింది. పైగా తమిళ వెర్షన్ బాగా క్లిక్ అయింది. కానీ తెలుగులో మాత్రం మాంచి ఓపెనింగ్స్ తెచ్చుకోలేకపోయింది. అదే టైమ్ లో టాక్ కు అనుగుణంగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు కూడా రాబట్టుకోలేకపోయింది.

ఎటొచ్చీ మౌత్ టాక్ పుణ్యమా అని వున్న కలెక్షన్లు ఏవో స్టడీగా వున్నాయి. కానీ ఏమయినా సినిమాను హిట్ రేంజ్ కు చేర్చలేకపోయారన్నది వాస్తవం. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి, హీరో కార్తీ కలిపి కష్టపడి థియేటర్లు అన్నీ తిరిగారు. కానీ సినిమా విడుదలకు ముందు మాత్రం సరైన విధంగా పబ్లిసిటీ చేసుకుని బజ్ తెచ్చుకోలేకపోయారు.

నిర్మాత సూర్య కేవలం తెలుగు రాష్ట్రాల హక్కులు మాత్రమే ఇచ్చి, మిగిలినవన్నీ వాళ్లే చూసుకున్నారు. దాంతో ఏమేరకు కిట్టుబాటు అవుతుందో ఆ మేరకే ప్రచారం సాగించారు. సోషల్ మీడియా అంటే కేవలం ఓవర్ సీస్ అనుకుని, సాంప్రదాయ పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, రైతు సమస్యలు సినిమా అన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడంతో ఓపెనింగ్స్ కు తేడా వచ్చాయి.

తరువాత మౌత్ టాక్ కొంతవరకు పాజిటివ్ గా వుండడం కలిసివచ్చింది. అయినా కూడా కలెక్షన్లు ఫరవాలేదు అనుకుంటే, ఆర్ ఎక్స్ 100 కొంత బ్రేక్ వేసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?