Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సింగిల్ హ్యాండ్ తో నారా రోహిత్

సింగిల్ హ్యాండ్ తో నారా రోహిత్

వీరభోగ వసంత రాయలు. ఈ సినిమా టైటిల్ నే ఓ చిత్రంగా వుంది. ఇక సినిమాలో హీరో శ్రీవిష్ణు చిత్రమైన గెటప్ తో కనిపిస్తాడని ఇంతకు ముందే వెల్లడించాం. గుండు, ఆపై వళ్లంతా టట్టూలతో శ్రీవిష్ణు కనిపిస్తాడని తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ అప్ డేట్ ఏమిటంటే, ఆద్యంతం హీరో నారారోహిత్ ఒంటిచేత్తో కనిపించడం.

ఈసినిమాలో నారారోహిత్ కు ఓ చేయివుండదు. కేవలం ఎడమచేతితోనే కనిపిస్తాడు. వాస్తవానికి నారారోహిత్ ది ఎడమచేతి వాటమే. ఈ సినిమాలో అందుకే ఎడమచేయి కాకుండా, కుడిచేయి లేకుండా ప్లాన్ చేసారని తెలుస్తోంది.

చిత్ర విచిత్రమైన కథతో వీరభోగ వసంతరాయలు సినిమా ముస్తాబవుతోంది. పూర్తిగా ప్రయోగాత్మక చిత్రం ఇది. బెల్లాన అప్పారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంద్రసేన దర్శకుడు.  హీరోయిన్ శ్రేయ ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?