సవ్యసాచికి ఓ సమస్య కాదు

సవ్యసాచి సినిమా ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ వెనక్కు వెనక్కు జరుగుతూనే వుంది. ఆఖరికి పదిరోజుల వర్క్ మిగిలి వుందనగా, శైలజరెడ్డి అల్లుడు సినిమాతో క్లాష్ వచ్చింది. ఇప్పుడు ఆఖరికి టైమ్ వచ్చింది. శైలజరెడ్డి…

సవ్యసాచి సినిమా ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ వెనక్కు వెనక్కు జరుగుతూనే వుంది. ఆఖరికి పదిరోజుల వర్క్ మిగిలి వుందనగా, శైలజరెడ్డి అల్లుడు సినిమాతో క్లాష్ వచ్చింది. ఇప్పుడు ఆఖరికి టైమ్ వచ్చింది. శైలజరెడ్డి అల్లుడు షూట్ పూర్తయింది. ఓ పాట మినహా మిగిలిన వర్క్ అంతా  పూర్తి చేసుకుని, సినిమాను రీరికార్డింగ్ కు కూడా ఇచ్చేసారు. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్, ఎడిటింగ్ అంతా అయిపోయింది. సెకండాఫ్ ఎడిటింగ్ జరుగుతోంది. దాని స్పీడు అలా వుంటే,

సవ్యసాచికి ఇంకా ప్యాచ్ వర్క్ లు కావచ్చు, చిన్న చిన్న అటాచ్ మెంట్ లు కావచ్చు పదిరోజుల వర్క్ మిగిలి వుంది. ఇందులో భూమిక, మాధవన్, నాగచైతన్య అందరి డేట్స్ అవసరం. ముఖ్యంగా మాధవన్ చిన్న ప్రమాదం కారణంగా రెస్ట్ లో వున్నారు. ఆయన  ఏదోవిధంగా రావాల్సి వుంది. భూమిక సినిమా అంగీకరించేటపుడే శని, ఆదివారాలు మాత్రమే చేస్తానని షరతుపెట్టారు. సో, అది చూసుకోవాలి. ఇవన్నీ కలిపి సినిమా షూట్ ను పూర్తి చేసుకోవాలి.

అందువల్ల ఎలాలేదన్నా,  ఆగస్టు ఒకటి రెండు తేదీలకు కానీ టాకీ వర్క్ పూర్తికాదని తెలుస్తోంది. కీరవాణి రీరికార్డింగ్ పనిలో వున్నారు. అది పూర్తికావాలి. అలాగే ఎడిటింగ్ కూడా మొత్తం కాపీ వస్తే కానీ స్టార్ట్ చేయడంలేదని వినికిడి. ఈ బాలారిష్టాలు అన్నీ దాటుకుని సినిమా రెడీ కావాలి. అందువల్ల ఆగస్టు రెండోవారం దాటిన తరువాత కానీ విడుదలకు రెడీకావడం కష్టం అని తెలుస్తొంది. అప్పుడు కూడా ప్రచారానికి టైమ్ వుండాలి.

హీరో కలుగచేసుకుని, శైలజరెడ్డి డేట్ ను తీసుకుని సవ్యసాచికి ఇస్తే తప్ప కుదరదు. కానీ ఆగస్టు 31 డేట్ ను వదులుకోవడానికి శైలజరెడ్డి నిర్మాతలు ఓకే అనడంలేదు. ఇధిలా వుంటే సవ్యసాచి మార్కెటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఆ పని కూడా ఇంకా వుండనే వుంది. ఇవన్నీ దాటుకుని మరి శైలజరెడ్డి కన్నా ముందు విడుదలవుతుందా? వెనక్కు వెళ్తుందా? అన్నది చూడాలి.