నీట్లో రాజధాని

ఎవరైనా ఓ చాన్సిచ్చి, ఆపై ఆల్టర్నేటివ్ వెదుకుతారు. కానీ ఆంధ్ర ప్రభుత్వం అస్సులు చాన్సే తీసుకోదల్చుకోలేనట్ల కనిపిస్తోంది. 30 వేల ఎకరాలు రాజధాని కోసం కావాలని లెక్క తేల్చారు. దానికి పూలింగ్ విధానం అనే…

ఎవరైనా ఓ చాన్సిచ్చి, ఆపై ఆల్టర్నేటివ్ వెదుకుతారు. కానీ ఆంధ్ర ప్రభుత్వం అస్సులు చాన్సే తీసుకోదల్చుకోలేనట్ల కనిపిస్తోంది. 30 వేల ఎకరాలు రాజధాని కోసం కావాలని లెక్క తేల్చారు. దానికి పూలింగ్ విధానం అనే బ్రహ్మపదార్ధం లాంటి పద్దతిని కనిపెట్టారు. అలా ఇస్తే సరే లేకుంటే, భూ సేకరణే అని బెత్తం ముందే చూపిస్తున్నారు. అందుకోసం అధికారిని కూడా నియమించేస్తున్నారు. అంటే ఏమనుకోవాలి..ఇస్తారా..చస్తారా అని అడగాలని ప్రభుత్వం డిసైడ్ అయిందనుకోవాలి. కానీ ఇక్కడో ముచ్చట వుంది.

రాజధాని ఎక్కడ వస్తుంది?

దాని హద్దులు ఏమిటి? దాని పరిథిలోకి వచ్చే భూములు ఏమిటి?

పూలింగ్ విధానం అనగానేమి..దాని విధి విధానాలేమిటి..మంచి చెడ్డలేమిటి?

పూలింగ్ విధానం ఏ విధంగా లాభదాయకం..భూ సేకరణ రైతులకు ఏ విధంగా నష్ట దాయకం. 

గోదావరి జిల్లాల్లో ఓ సామెత వుంది. నీట్లో గేదెను పెట్టి బేరం ఆడినట్లు అని. గేద కొమ్ములు మాత్రమే కనిపిస్తుంటాయి. మిగతాదంతా చెరువులోవుంటుంది. బ్రోకర్ చెబుతుంటాడు..సూపర్ గేదె..ఇంత లావు పోదుగు..ఇన్ని లీటర్ల పాలు, ఇంత భారీ శరీరం అని. కానీ అసలు కొమ్ములు తప్ప వేరే కనిపించదు. 

రాజధాని వ్యవహారం కూడా అలాగే వుంది. పైన పేర్కోన్న సందేహాలన్నీ అలాగే వున్నాయి. పూలింగ్ ఏమిటని, దాని విధివిధానాలేమిటని, రెవెన్యూ శాఖ సిబ్బందిని అడిగినా తల అడ్డంగా ఊపుతున్నారు తమకు ఏమీ తెలియదని. మరి అది లాభమో, నష్టమో తెలియకుండా జనం ఎలా ఒకె అంటారు. అదే సమయంలో వారి పీకపై ఈ భూసేకరణ కత్తి ఎందుకు పెట్టడం. ముందు వారికి పూలింగ్ పై వున్న అనుమానాలు తీర్చాలి. అసలు ఎక్కడ రాజధాని వస్తుందో, ఎవరి భూములు తీసుకోబోతున్నారో, లేదా అవసరం పడబోతున్నాయో స్పష్టం చేయాలి. అప్పుడు మిగిలిన వ్యవహారాలు. కానీ అవన్నీ వదిలేసి…ఇచ్చేయండి భూములు..లేదా లాక్కుంటాం..అనడం ఏమిటి?

స్టాంప్ డ్యూటీ రద్దు, రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ అంటున్నారు. చిన్న అనుమానం ఎక్కడైనా కొనుక్కున్న వారు, లేదా లీజుకు తీసుకున్నవారు, లేదా దాన్ని తీసుకున్నవారు వాళ్లు కదా..వీటిని భరిస్తారు. అంటే ఇక్కడ ప్రభుత్వమే కదా భరించాలి.మరి ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల లాభం ప్రభుత్వానికా లేదా భూమి యజమానులకా? 

చాణక్య

[email protected]