మొత్తానికి ఈ మధ్య పెద్ద సినిమాలు అన్నీ ఫట్ మనడం, ఇప్పుడు సినిమాలు చేస్తున్న నిర్మాతలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. అందునా ముఖ్యంగా తెలుగు సినిమా ఆదాయానికి ఆయువు పట్టులాంటి నైజాం ఏరియాలో ఇప్పుడు బయ్యర్లు కరువయ్యారు. అసలు అక్కడ వున్న బయ్యర్లే తక్కువ. దిల్ రాజు, సుధాకర రెడ్డి, కొంతలో కొంత దాసరి నారాయణరావు.
ఇప్పుడు దిల్ రాజు పరస్థితి బాగాలేదు. ఆయన చాలా సినిమాలు కొని దెబ్బ తిన్నారు. సినిమాలు తీసి దెబ్బ తిన్నారు. సుధారకరెడ్డి ఆచి తూచి అడుగు ముందుకేస్తున్నారు. దీంతో నైజాంలో సినిమాలు పంపిణీ చేసేవారే కానీ, కొనేవారు లేకపోయారు. గోవిందుడు అందరివాడేలే, దిక్కులు చూడకురామయ్యా , అనుక్షణం ఇలా చాలా సినిమాల జాబితా వుంది. అల్లరి నరేష్ తాజా సినిమా బ్రధర్ ఆఫ్ బొమ్మాళి కూడా ఆ జాబితాలో చేరిపోయింది.
ఇదంతా సినిమాల మీద నమ్మకం లేక కాదు..బయ్యర్ల దగ్గర తడిలేక. ముందు కొన్న రభస, ఆగడు, సికిందర్ లాంటి సినిమాలు వున్నవన్నీ ఊడ్చిపెట్టుకుపోవడంతో వచ్చిన పరిస్థితి ఇది. ఆంధ్రలో మరీ ఇంత దారుణంగా లేకున్నా, కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఇప్పడిప్పుడే వస్తోంది. ఆంధ్రకు,నైజాం కు తేడా ఏమిటంటే, నైజాం ఏరియా అంతా ఒకటిగా అమ్మడం అలవాటైంది. ఆంధ్ర అలా కాదు. కృష్ణ, గుంటూరు, ఈస్ట్-వెస్ట్, విశాఖ మూడు జిల్లాలు ఇలా వుంది. అందువల్ల నైజాం పెట్టుబఢితో చూసుకుంటే తక్కువ. అందువల్ల అక్కడ ఇంకా బయ్యర్లు పుడుతున్నారు.
ఇప్పటికైనా దర్శక,నిర్మాతలు, హీరోలు జాగ్రత్త పడకపోతే, ఎవరు తీసిన,వేసిన సినిమా వారే చూసుకోవాల్సి వస్తుంది కొన్నాళ్లకు.