100.. 200.. 300.. వాట్‌ యాన్‌ ఇన్నింగ్స్‌.!

అర్థ సెంచరీ కొట్టేశాడు.. జట్టులో స్థానం నిలబెట్టుకున్నట్టే.. సెంచరీ సాధించేశాడు.. ఇంకేం, సత్తా చాటేశాడు. డబుల్‌ సెంచరీ సాధించాడు.. సింప్లీ సూపర్బ్‌.. 250 కొట్టేశాడు.. అద్భుతం.. 300 పరుగులు సాధించాడు.. మహాద్భుతం.!  Advertisement అద్భుతం,…

అర్థ సెంచరీ కొట్టేశాడు.. జట్టులో స్థానం నిలబెట్టుకున్నట్టే.. సెంచరీ సాధించేశాడు.. ఇంకేం, సత్తా చాటేశాడు. డబుల్‌ సెంచరీ సాధించాడు.. సింప్లీ సూపర్బ్‌.. 250 కొట్టేశాడు.. అద్భుతం.. 300 పరుగులు సాధించాడు.. మహాద్భుతం.! 

అద్భుతం, మహాద్భుతం చాలా చిన్న మాటేమో. ఎందుకంటే, అవకాశాలు రావడమే కష్టం.. అరుదుగా వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇంకా కష్టం. అనుకోకుండా వచ్చిన అవకాశమది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఎంత కష్టపడాలి.? ఓ పక్క జట్టులో స్థానం నిలుపుకోవాలనే టెన్షన్‌.. ఇంకో పక్క, జట్టుకి వెన్నుదన్నుగా వుండాలనే తపన.. వెరసి, హై టెన్షన్‌ నడుమ పరుగులు సాధించడం అంత తేలికైన విషయం కాదు. 

మొట్టమొదటి సెంచరీని, డబుల్‌ సెంచరీగా మార్చి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడనుకుంటే, దాన్ని ట్రిపుల్‌ సెంచరీగా మార్చి.. మరో అరుదైన ఘనతను దక్కించుకున్నాడు కరుణ్‌ నాయర్‌. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇంతకు ముందు కేవలం గారీ సోబర్స్‌, సింప్సన్‌ మాత్రమే ఈ ఘనతను దక్కించుకున్న క్రికెటరు. ఆ దిగ్గజాల సరసన కరుణ్‌ నాయర్‌ చోటు సాధించాడు. 

కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీతో టీమిండియా స్కోర్‌ 759 పరుగులు చేసింది. అన్నట్టు, టీమిండియాకి టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోర్‌.