Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఓవర్ సీస్ మార్కెట్ పై దిల్ రాజు కన్ను

ఓవర్ సీస్ మార్కెట్ పై దిల్ రాజు కన్ను

ఓవర్ సీస్ జనాలు ఏ విధమైన సినిమాలు ఇష్టపడతారో మన టాలీవుడ్ వాళ్లకు అర్థమైపోయింది. సరైన సినిమా పడితే టాలీవుడ్ మార్కెట్ తోనే బడ్జెట్ మొత్తం రాబట్టేయచ్చు. దిల్ రాజు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. శతమానం భవతి సినిమా పక్కా అర్బన్ అండ్ ఓవర్ సీస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తయారైందని తెలుస్తోంది.

విదేశాల్లో పిల్లలు వుండి, ఇక్కడ అభిమానాలకు దూరమైన ఓ జంట కథ. పిల్లల్లందర్నీ రప్పించాలని, విడాకులు తీసుకుంటున్నామని చెప్పి, మొత్తం అందర్నీ ఇండియాకు రప్పించడం, అభిమానాలు, పల్లెటూర్లు, పండగలు ఇలా అన్నీ పెర్ ఫెక్ట్ గా మిక్స్ చేసారట. ఒక్క సంక్రాంతి పండగ ఎపిసోడ్ నే 20 నిమషాల వరకు వుంటుందని తెలుస్తోంది.

దిల్ రాజు పక్కా ప్లాన్ తో చేసిన ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఎక్కువే కానీ, బడ్జెట్ మరీ పరిమితులు దాటిపోలేదు. అందువల్ల ఒక వేళ ఓవర్ సీస్ జనాలకు నచ్చేసిందంటే, ఇక బడ్జెట్ అంతా అక్కడే వచ్చేస్తుంది. ఆ ధైర్యంతోనే శాతకర్ణి, ఖైదీ 150 లాంటిపెద్ద సినిమాల నడుమ ఈ సినిమాను వదుల్తున్నారు దిల్ రాజు.ఈ సినిమాలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?