అంబటిరాయుడు.. ఈ తీరుతోనే ఇలా!

బీసీసీఐ మీద తిరుగుబాటు చేసినట్టుగా మాట్లాడటం, ఆ తరహా చర్యలకు పాల్పడటం.. ఆ తర్వాత వెనక్కు తగ్గడం. ఈ తీరు అంబటి తిరుపతిరాయుడుకు కొత్త కాదు. పుష్కలమైన ప్రతిభ ఉందని టీనేజ్ నుంచినే అనిపించుకుంటున్నా..…

బీసీసీఐ మీద తిరుగుబాటు చేసినట్టుగా మాట్లాడటం, ఆ తరహా చర్యలకు పాల్పడటం.. ఆ తర్వాత వెనక్కు తగ్గడం. ఈ తీరు అంబటి తిరుపతిరాయుడుకు కొత్త కాదు. పుష్కలమైన ప్రతిభ ఉందని టీనేజ్ నుంచినే అనిపించుకుంటున్నా.. ఆ స్థాయిలో రాయుడు కెరీర్ సాగకపోవడానికి అతడి తీరు కూడా ఒకరకమైన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడతారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తను వైదొలుగుతున్నట్టుగా, అన్నిరకాల ఫార్మాట్ ల నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించిన ఈ క్రికెటర్ మళ్లీ ఇప్పుడు బ్యాట్ పడుతున్నాడు.

లీగ్ లలో ఆడటానికి రెడీ అయ్యాడు. అంతేగాక ఐపీఎల్ లో ఆడటానికి రెడీ అంటూ ప్రకటించాడు. మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికవ్వడమే టార్గెట్ అని ప్రకటించాడు. ఇటీవలే సెలెక్టర్ల మీద సైతం సెటైరికల్ ట్వీట్లు పెట్టిన ఇతడు రిటైర్మెంట్ అంటూ, మళ్లీ అంతలోనే రిటర్న్ అంటూ ప్రకటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

అయితే రాయుడుకు ఇలాంటివి కొత్త కాదు. గతంలో హైదరాబాద్ రంజీ టీమ్ రాయుడు ప్రకంపనలు రేపాడు. అసోసియేషన్ పెద్దలతోనూ, కొందరు సహచరులతోనూ గొడవపడ్డాడు. అందులో తప్పు ఎవరిదైనా కావొచ్చు. అయితే రాయుడు మాత్రం బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి పూర్తిగా బయటకు వచ్చాడు. అప్పట్లో రేగిన తిరుగుబాటు లీగ్ ఐసీఎల్ లో ఆడాడు. బీసీసీఐ నుంచి నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.

అయితే ఆ తర్వాత  ఐసీఎల్ రద్దుకావడం, తిరుగుబాటు ప్లేయర్లకు మళ్లీ బీసీసీఐ పునరావాసం కల్పించడంతో రాయుడుకు లైన్ క్లియర్ అయ్యింది. జాతీయ జట్టులో స్థానం దక్కింది. ఇటీవల ప్రపంచకప్ లో తనకు స్థానం దక్కలేదని రాయుడు నిరసన ప్రకటన చేశాడు. అదే ఊపులో రిటైర్మెంట్ అన్నాడు.

ఇప్పుడు మళ్లీ జాతీయ జట్టుకు సెలెక్ట్ అవుతానంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఉన్నట్టుండి రిటైర్మెంట్ ప్రకటనతో చాలామంది రాయుడుకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మళ్లీ అతడే తన స్టాండ్ ను మార్చుకున్నాడు. ఇక నుంచి ఈ తెలుగు క్రికెటర్ ప్రస్థానం ఎలా ఉంటుందో!

శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే!