టీమిండియా వరల్డ్ కప్‌లో శుభారంభం చేస్తే, టీమిండియా చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్.. పరాజయంతో వరల్డ్‌కప్‌లోకి అడుగు పెట్టినట్లయ్యింది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా, పాకిస్తాన్‌పై 76 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే.
దాయిదుల పోరులో ఎప్పుడూ టీమిండియాదే వరల్డ్ కప్ పోటీల వరకూ పై చేయి అయినప్పటికీ, పాక్ అభిమానులు.. భారత్‌పై తమ జట్టు విజయం సాధించాలని కోరుకుంటారు. ఈసారి కూడా వారి కోరిక నెరవేరలేదు. దాంతో, పాకిస్తాన్ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆందోళనలకు దిగారు. మ్యాచ్‌లో పాక్ ఓడిపోయిందని తెలియగానే, టీవీ సెట్లను వీధుల్లోకి తీసుకొచ్చి బద్దలగొట్టేశారు.. తమ దేశ క్రికెటర్ల దిష్టిబొమ్మల్ని తగలబెట్టారు. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
మరోపక్క భారతదేశంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని, రాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు టీమిండియాని అభినందనలతో ముంచెత్తారు. భారత క్రికెట్ అభిమానులు వీధుల్లోకొచ్చి హంగామా చేశారు.