Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ కి హీరోయిన్ దొరికింది

రామ్ కి హీరోయిన్ దొరికింది

రామ్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం శివం. సురేంద‌ర్‌రెడ్డి శిష్యుడు శ్రీ‌నివాస‌రెడ్డి ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. రామ్ ప‌క్కన హీరోయిన్‌గా ఓ కొత్తమ్మాయి కోసం అన్వేష‌ణ సాగిస్తోంది చిత్రబృందం. ఈ వేట ఫ‌లించింది. 

రామ్ ప‌క్కన క‌థానాయిక‌గా ఐనా శ‌ర్మని ఎంచుకొన్నారు. ఈమె ఎవ‌రో కాదు.. నేహా శ‌ర్మ చెల్లాయి. చిరుత‌, కుర్రాడు సినిమాల‌తో ఆక‌ట్టుకొంది నేహా శ‌ర్మ‌. ఆత‌ర‌వాత అవ‌కాశాలు లేక‌... డీలా ప‌డిపోయింది. ఇప్పుడు చెల్లెమ్మని రంగంలోకి దింపింద‌న్నమాట‌. మ‌రి ఈ అమ్మడి టాలెంట్ ఏంటో తెలియాలంటే... శివం రావాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?