టెంప‌ర్ 2వ రోజు ప‌రిస్థితేంటి??

తొలి రోజు దాదాపుగా రూ.9.5 కోట్లతో బాక్సాఫీసు ద‌గ్గర టెంప‌ర్ లేపింది టెంప‌ర్‌. పాజిటీవ్ టాక్‌తో.. థియేట‌ర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డుల‌తో క‌ళ‌కళ‌లాడిపోయాయి. అయితే రెండో రోజు మాత్రం.. టెంప‌ర్ వ‌సూళ్లు ఆశ్చర్యప‌రిచాయి. క‌నీసం రెండో…

తొలి రోజు దాదాపుగా రూ.9.5 కోట్లతో బాక్సాఫీసు ద‌గ్గర టెంప‌ర్ లేపింది టెంప‌ర్‌. పాజిటీవ్ టాక్‌తో.. థియేట‌ర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డుల‌తో క‌ళ‌కళ‌లాడిపోయాయి. అయితే రెండో రోజు మాత్రం.. టెంప‌ర్ వ‌సూళ్లు ఆశ్చర్యప‌రిచాయి. క‌నీసం రెండో రోజు రూ.8 కోట్లయినా సాధిస్తుంద‌నుకొంటే.. రూ.5 కోట్ల ద‌గ్గరే టెంప‌ర్ వ‌సూళ్లు ఆగిపోయాయి. 

రెండో రోజు మ‌ల్టీప్లెక్స్‌ల  ఆక్యుపెన్సీ  కొంత తగ్గింది. కొన్ని బీ సెంట‌ర్లు లో కూడా.  ఆదివారం టెంప‌ర్‌కి పెద్ద దెబ్బ‌. ఎందుకంటే.. ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ న‌డుస్తోంది. యూత్ అంతా క్రికెట్ ఫీవ‌ర్‌లో మునిగిపోయింది. కాబ‌ట్టి మూడో రోజు కూడా టెంప‌ర్ డ‌ల్ అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 

మంగ‌ళ‌వారం సెల‌వు దినం. సోమవారం, ఆ మర్నాడు మ‌హా శివ‌రాత్రి కాబ‌ట్టి… సెల‌వు దొరికింది. ఆదివారం నాటి బాకి ఆ రోజు తీర్చుకొంటే త‌ప్ప‌… టెంప‌ర్ మ‌ళ్లీ వ‌సూళ్ల జోరు చూపించ‌లేదు. మొత్తానికి తొలి మూడు రోజుల‌కూ రూ.19 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్కగ‌డుతున్నాయి.