టీ20ల్లో భారతీయుడి కొత్త రికార్డు!

బంగ్లాదేశ్ తో జరిగిన  టీ20 సీరిస్ ను ఎట్టకేలకూ భారత్ నెగ్గింది. ఇన్నేళ్లూ బంగ్లాను బేబీలుగానే వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తొలిసారి బంగ్లాతో టీమిండియా ఒక సీరిస్ ను గెలవడానికి శ్రమించాల్సి వచ్చింది. ఈ…

బంగ్లాదేశ్ తో జరిగిన  టీ20 సీరిస్ ను ఎట్టకేలకూ భారత్ నెగ్గింది. ఇన్నేళ్లూ బంగ్లాను బేబీలుగానే వ్యవహరిస్తూ వచ్చారు. అయితే తొలిసారి బంగ్లాతో టీమిండియా ఒక సీరిస్ ను గెలవడానికి శ్రమించాల్సి వచ్చింది. ఈ సీరిస్ తొలి టీట్వంటీలోనే టీమిండియా ఓటమి పాలైంది.  రెండో మ్యాచ్ లో సత్తా చూపించినా, మూడో మ్యాచ్ లో బంగ్లా ప్లేయర్లు కాసేపు ఇండియాను కంగారు పెట్టారు. ఇండియాపై తొలిసారి సీరిస్ ను గెలుస్తున్నారనిపించారు. 

అయితే ఆఖరి ఓవర్లలో టీమిండియా పట్టు బిగించింది. రెచ్చిపోయి ఆడుతున్న బంగ్లా బ్యాట్స్ మన్ ను వరసగా పెవిలియిన్ కు క్యూ కట్టించి టీమిండియాను విజయపథంలో నిలిపారు బౌలర్లు. ఈ మ్యాచ్ లో మరో విశేషం ఏమిటంటే.. ఇండియా తరఫున టీట్వంటీలో ఒక కొత్త రికార్డు నమోదైంది. అంతర్జాతీయ టీట్వంటీ మ్యాచ్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ను నమోదు చేశాడు భారత యువ బౌలర్ దీపక్ చహర్. ఇన్నేళ్లూ  శ్రీలంక మ్యాజికల్ స్పిన్నర్ అజంత మెండిస్ పేరిట ఉన్న రికార్డును చహర్  తన పేరు మీదకు బదిలీ చేసుకున్నాడు.

మొత్తం ఏడు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు చహర్. ఇందులో ఒక హ్యాట్రిక్ ఉంది. ఇది వరకూ  మెండిస్ ఎనిమిది పరుగులకు ఆరు వికెట్లు తీశాడు. ఆ రికార్డును చహర్ సవరించాడు. 3.2ఓవర్లలోనే ఈ  భారత ఆటగాడు సత్తా చూపించాడు. తను తీసిన ఆరు వికెట్లలో ఒక హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు చహర్.