మోడీ కేబినెట్లో ఉండిన ఏకైక శివసేన మంత్రి అరవింద్ సావంత్ ను రాజీనామా చేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు. ఇటీవల ఏర్పడిన మోడీ సర్కారులో శివసేనకు ఒక మంత్రి పదవిని ఇచ్చారు. అది కేబినెట్ ర్యాంకు పదవి.
ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి తెలిసిన సంగతే. శివసేన-బీజేపీలు తీవ్రంగా విబేధించుకుంటూ ఉన్నాయి. అధికారమే పరమావధిగా, ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా ఇరు పార్టీలూ రచ్చ చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, ఇప్పుడు ప్రభుత్వాన్ని మాత్రం కలిసి ఏర్పరచడానికి ఆ పార్టీలు ముందుకు రావడం లేదు. ముఖ్యమంత్రి పీఠాన్ని కోరుకుంటూ ఆ పార్టీలు విబేధించుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో మోడీ కేబినెట్ నుంచి శివసేన బయటకు రావడానికి రెడీ అయ్యందని స్పష్టం అవుతోంది. కేంద్ర కేబినెట్లో కూడా బీజేపీ శివసేనకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం ఒకే ఒక మంత్రి పదవిని ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్క మంత్రీ తను రాజీనామా చేస్తున్నట్టుగా, ఢిల్లీలో వాతావరణం బాగోలేనట్టుగా ట్విటర్లో ప్రకటించడం గమనార్హం.