Advertisement

Advertisement


Home > Politics - Gossip

పులి-పువ్వు బంధం చీలిపోయినట్టే!

పులి-పువ్వు బంధం చీలిపోయినట్టే!

సుదీర్ఘకాలంగా పెనవడిన హిందూబంధం తెగిపోయినట్టే. కాషాయం నీడలో ఒకే రకమైన మతవాద ఎజెండాతో అనుబంధం కొనసాగిస్తున్న రెడు పార్టీలు... తమ సిద్ధాంతాల బలం కంటె అధికారం మీద యావే ఎక్కువని, ప్రజల తీర్పును గౌరవించడం కంటె- తమ వ్యక్తిగత ఈగోలే ముఖ్యమని నిరూపించుకుంటున్నాయి.

మహారాష్ట్రలో శివసేన- భారతీయ జనతా పార్టీల మధ్య అనుబంధం దాదాపుగా తెగిపోయినట్టే. ఇక శివసేన అధికారికంగా ఎన్డీయేనుంచి బయటకు రావడం అనే లాంఛనం ఒక్కటే మిగిలి ఉంది.

మహారాష్ట్ర రాజకీయాలు ఫలితాలు వచ్చిన నాటినుంచి.. రకరకాల మలుపులు తిరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తమకు అధికారంలో సగం అదికూడా మొదటి రెండున్నర సంవత్సరాలు, కట్టబెడితే తప్ప.. భాజపాతో కలిసి ఉండేది లేదని 56 సీట్లు సాధించిన శివసేన భీష్మించుకు కూర్చుంది. అధికారంలో అసలు వాటా ఇవ్వడం అనే ప్రసక్తే లేదంటూ భాజపా కూడా అదే స్థాయిలో మొండిపట్టు పట్టింది.

ఈలోగా పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి.. శివసేనను రెచ్చగొట్టడం ప్రారంభించాయి. ఎన్డీయేనుంచి బయటకు వస్తే తప్ప మద్దతు ఇవ్వమని ఎన్సీపీ పేర్కొంది.

ఈ నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తొలుత అత్యధిక సీట్లు సాధించిన భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. శివసేనతో మంతనాలు ఒక కొలిక్కి రాకపోవడంతో.. రెండు రోజుల తరవాత భాజపా అధికారం ఏర్పాటు చేయడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. ఆటోమేటిగ్గా ఇప్పుడు రెండో అతిపెద్ద పార్టీ శివసేనకు గవర్నర్ ఆఫర్ ఇచ్చారు.

ఇప్పుడు డ్రామా రసకందాయంలో పడింది. ఎన్డీయేనుంచి బయటకు వస్తే మద్దతు ఇస్తామని.. అయినా ఏ సంగతి కాంగ్రెస్ తో మాట్లాడి చెప్తామని ఎన్సీపీ అంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శివసేనకు మద్దతిచ్చే ప్రసక్తేలేదని.. సోనియా గట్టిగా చెప్పినట్లు ఆ నడుమ వార్తలువచ్చాయి. శివసేన భాజపాకంటె దారుణమైన హిందూత్వ ముద్రతో ఉన్న పార్టీ గనుక.. కాంగ్రెస్ తమ లౌకికవాద ముసుగు చెరగిపోతుందని జంకవచ్చు.

ఇలాంటి సంక్లిష్ట నేపథ్యంలో.. శివసేన ఈ అధికారం ఆఫర్ను ఉపయోగించుకోగలుగుతుందా? లేదా? ఉపయోగించుకుంటే.. ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి...? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?