శ్రీలంకలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా విజయానికి 153 పరుగుల దూరంలో వుంది. ఇన్నింగ్స్ విజయాన్ని సొంతం చేసుకోవాల్సినప్పటికీ, భారత బౌలర్లు చేతులెత్తేయడం, లంక బ్యాట్స్‌మన్ చండీమాల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డం.. వెరసి టీమిండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి వచ్చింది.
తొలి ఇన్నింగ్స్‌లో లంకని దెబ్బకొట్టిన బౌలర్లు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో కూడా లంక ఇన్నింగ్స్‌ని అదే తీరులో దెబ్బకొట్టేలా కనిపించారు. కానీ, చండిమాల్ మ్యాచ్‌ని టీమిండియా నుంచి లాక్కున్నంత పన్జేశాడు. వన్డే తరహాలో ధాటిగా బ్యాటింగ్ చేయడంతో, అతన్ని ఆపడానికి భారత బౌలర్ల దగ్గరి అస్త్రాలేవీ పనికిరాలేదు. ఎలాగైతేనేం.. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 367 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
176 పరుగుల విజయ లక్ష్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా, ఆదిలోనే తొలి వికెట్‌ని కోల్పోయింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ 5 పరుగులకే వికెట్ పారేసుకున్నాడు. ఆట ముగిసే సమయానికి రోహిత్ శర్మ 13 పరుగులతో, నైట్ వాచ్‌మెన్‌గా బరిలోకి వచ్చిన ఇషాంత్ శర్మ 5 పరుగులతోనూ క్రీజ్‌లో వున్నారు. టీమిండియా ప్రస్తుత స్కోర్ 23.
అద్భుతం జరిగితే తప్ప, ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయాన్ని శ్రీలంక అడ్డుకోలేదు. అయతే సొంత గడ్డపై లంక ఆటగాళ్ళు ఎప్పుడు ఎలా పట్టు సాధిస్తారో అంచనా వేయడం కష్టం. చండీమాల్ ఎదురుదాడే అందుకు నిదర్శనం. తడబాటుకు గురికాకుండా, లంక బౌలర్లను తీరిగ్గా ఎదురుకుంటే టీమిండియా విజయం నల్లేరుమీద నడకే. చూద్దాం.. ఏం జరుగుతుందో.!