కత్తి సినిమా మళ్లీ మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఈ సినిమా హక్కులు కొన్న కొత్తల్లోనే ఓ విషయం వెల్లడించాం..ఆ సినిమా హీరో విజయ్ డబ్బింగ్ కే ఓకె అంటున్నాడు కానీ, రీమేక్ కు కాదని, తన ఇమేజ్ తెలుగునాట పెంచుకోవాలన్నదే ఆ హీరో ఉద్దేశం అని.
కానీ హక్కులు కొన్నవారి ధీమా ఏమిటో కానీ, హీరోల వెంట తిరుగుతూ వచ్చారు. ఎక్కడా ఓకె కాలేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా ఒకె అన్నారు. కానీ ఇప్పుడు విజయ్ ఓకె అనడం లేదని టాక్. జిల్లా సినిమాకు ఓ మాదిరిగా బానే రెస్పాన్స్ వచ్చింది.
అందుకే ఇప్పుడు కత్తిని కూడా డబ్బింగ్ మాత్రమే చేయాలని, రీమేక్ కాదని విజయ్ పట్టుపుడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై డిస్కషన్లు జరుగుతున్నాయని, నాలుగు రోజుల్లో కొలిక్కి రావచ్చని తెలుస్తోంది.చిరు 60వ బర్త్ డే లోగా దీనిపై క్లారిటీ రప్పించాలని ప్రయత్నిస్తున్నారట. ఏమవుతుందో మరి.