వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ గురించి ఒక ఆస్ట్రేలియన్ పత్రిక కొన్నాళ్ల కిందట సంచలన కథనాన్ని రాసింది. ఆస్ట్రేలియాలో జరిగిన గత క్రికెట్ ప్రపంచకప్ సమయంలో గేల్ మసాజ్ స్పెషలిస్టుతో అనుచితంగా ప్రవర్తించినట్టుగా ఆ పత్రిక కథనాన్ని ఇచ్చింది. అప్పట్లో అది సంచలనంగా నిలిచింది. సదరు మసాజ్ స్పెషలిస్టు ముందు గేల్ నగ్నంగా నిలబడ్డాడు అనేది ఆ పత్రిక రాసిన కథనం సారాంశం.
ఆమె గేల్ కు మసాజ్ చేయడానికి వెళ్లిందని, ఆ సమయంలో అతడు టవల్ కట్టుకు నిలబడ్డాడు అని, ఆమె దేన్నో వెదుకుతుంటే.. గేల్ ఏంటని అడిగాడని, టవల్ కోసం చూస్తున్నట్టుగా ఆమె చెప్పడంతో… గేల్ తన ఒంటి మీద టవల్ తీసి ఇచ్చాడని.. ఇలా క్రియేటివ్ గా కథనాన్ని ఇచ్చింది సదరు పత్రిక.
ప్రపంచ వ్యాప్తంగా గేల్ ను వార్తల్లో నిలిపింది ఆ వ్యవహారం. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఆ క్రికెటర్ ఆస్ట్రేలియన్ కోర్టులోనే పరువు నష్టం దావా వేశాడు. చివరకు ఈ వ్యవహారంలో గేల్ నెగ్గడం విశేషం. రెండు లక్షల డాలర్లకు పైగా నష్టపరిహారాన్ని కూడా గేల్ కు చెల్లించాలని సదరు మీడియా సంస్థకు ఆస్ట్రేలియన్ కోర్టు ఆదేశించింది.
మొత్తానికి తనను తీవ్రంగా బద్నాం చేసిన వ్యవహారంలో.. లేడీ ఫ్యాన్స్ తన దరిదాపుల్లోకి కూడా రాకుండా హడలు కొట్టిన వార్తా కథనం విషయంలో క్రిస్ గేల్ పరువునష్టం దావాను, భారీ మొత్తం పరిహారాన్ని నెగ్గడం విశేషం.