లీకైన టైటిల్ అనౌన్స్ చేసారు

కళ్యాణ్ రామ్ టైటిల్ కు కూడా పెద్ద సస్సెన్స్ హడావుడి. కానీ ఆ టైటిల్ వారం కిందటే లీక్ అయిపోయింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో జనాలు 'ఇదేగా టైటిల్' అంటూ వాళ్లే చెప్పేసారు.…

కళ్యాణ్ రామ్ టైటిల్ కు కూడా పెద్ద సస్సెన్స్ హడావుడి. కానీ ఆ టైటిల్ వారం కిందటే లీక్ అయిపోయింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో జనాలు 'ఇదేగా టైటిల్' అంటూ వాళ్లే చెప్పేసారు. మొత్తానికి ఆ విధంగా లీకైన టైటిల్ ను పద్దతిగా ఈ రోజు ప్రకటించారు.

కళ్యాణ్ రామ్ హీరోగా  సినిమాటోగ్రాఫర్ గుహన్ తొలిసారి డైరక్ట్ చేస్తున్న సినిమా టైటిల్ చిత్రంగా 118 అని ప్రకటించారు. 116,108 ఈ రెండు నెంబర్లు తెలుగునాట ఫేమస్. ఇప్పుడు కొత్తగా 118 పాపులర్ అవుతుందన్నమాట. పూర్తి సస్సెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో తయారవుతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ, అవుట్ అండ్ అవుట్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ తో తయారవుతున్న ఈ సినిమాకు 118 అన్నది పక్కా యాప్ట్ టైటిల్ అని, అది ఎందుకు అన్నది సినిమాలో రివీల్ అవుతుందని అన్నారు. సినిమాకు స్క్రీన్ ప్లే, కళ్యాణ్ రామ్ నటన హైలైట్ అవుతాయని ఆయన వెల్లడించారు.

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!… ఎందుకో తెలుసా?