మాస్ డైరక్టర్ అనిల్ రావిపూడి డైరక్షన్ లో వెంకీ-వరుణ్ తేజ్ ల సినిమా ఎఫ్ 2. సంక్రాంతికి విడుదల చేసే దిశగా రెడీ అవుతోంది. అనిల్ రావిపూడి అంటే పక్కా ఎంటర్ టైన్మెంట్ అండ్ మాస్. ఎఫ్ 2 మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ గా రెడీ అవుతోందని తెలుస్తోంది. స్టార్ట్ టు ఎండ్ నవ్వులే నవ్వులంట. ఈ సినిమా వరకు అనిల్ రావిపూడి ఫైట్స్ అన్నవి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
సినిమా మొత్తంమీద ఒక్క ఫైట్ కూడా వుండదట. కేవలం మాటలతో పంచ్ లు.. పంచ్ లు పడుతూనే వుంటాయట. ఇక ఈ పంచ్ లు వుండగా ఆ పంచ్ లు ఎందుకు అని ఫైట్లు లేకుండానే సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఇటీవల సినిమా రష్ చూసిన నిర్మాత దిల్ రాజు సన్నిహితులు కొందరు ఈ సినిమా సూపర్ గా వచ్చిందని, సంక్రాంతి సరైన సినిమా ఇదే అవుతుందని టాక్ చెప్తున్నారు.
మల్లీశ్వరి తరువాత వెంకీ ఇంతలా అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా చేయలందంటున్నారు. వరుణ్ తేజ్ కూడా ఇప్పటివరకు డిఫరెంట్ సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ కామెడీ సినిమాలు చేయలేదు. ఇదే తొలిసారి. వింటున్న వార్తలు విశ్లేషిస్తుంటే, 2019లో దిల్ రాజు మళ్లీ నిర్మాతగా హిట్ బాటపట్టేలా కనిపిస్తోంది వ్యవహారం.