కిర్‌స్టెన్‌ నమ్మకమేంటో మరి.!

భారత క్రికెట్‌ అభిమానులకే ఈ సారి కప్పుని టీమిండియా సొంతం చేసుకుంటుందనే నమ్మకం లేదు. పాకిస్తాన్‌పై టీమిండియా గెలవడం ముఖ్యం.. అది వరల్డ్‌ కప్‌ కన్నా ఎక్కువ.. అని ఫిక్స్‌ అయిపోయారు భారత క్రికెట్‌…

భారత క్రికెట్‌ అభిమానులకే ఈ సారి కప్పుని టీమిండియా సొంతం చేసుకుంటుందనే నమ్మకం లేదు. పాకిస్తాన్‌పై టీమిండియా గెలవడం ముఖ్యం.. అది వరల్డ్‌ కప్‌ కన్నా ఎక్కువ.. అని ఫిక్స్‌ అయిపోయారు భారత క్రికెట్‌ అభిమానులు. అందుక్కారణం, వరల్డ్‌ కప్‌కి ముందు వరుస పరాజయాల్ని టీమిండియా చవి చూడటమే. పాక్‌ మ్యాచ్‌ తర్వాత అంచనాలు మారిపోయాయి. టీమిండియా ఒక్కసారిగా టైటిల్‌ ఫేవరెట్‌ అయిపోయింది. బ్యాటింగ్‌లో రాణించిన టీమిండియా, బౌలింగ్‌లోనూ సత్తా చాటింది మరి.

ఇక, టీమిండియా మాజీ కెప్టెన్‌ గ్యారీ కిర్‌స్టెన్‌ అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌నే వరల్డ్‌ కప్‌ వరిస్తుందని జోస్యం చెప్పేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా ఛాంపియన్‌గా బరిలోకి దిగిందంటే అది కిర్‌స్టెన్‌ పుణ్యమే. 2011 వరల్డ్‌ కప్‌ టీమిండియా సాధించడం వెనుక కిర్‌స్టెన్‌ ఎఫర్ట్స్‌ చాలానే వున్నాయి. జట్టులో పోరాట పటిమ నూరిపోశాడు కోచ్‌గా కిర్‌స్టెన్‌. అందుకే కిర్‌స్టెన్‌ కన్నా టీమిండియా బలాబలాలు ఇంకెవరికీ తెలియవన్నది భారత క్రికెట్‌ అభిమానుల వాదన.

ఎలాగైతేనేం.. ఒక్కసారిగా టీమిండియా వరల్డ్‌ కప్‌లో అంచనాల్ని తారు మారు చేసింది. లీగ్‌లో ఇంకా సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లతో టీమిండియా తలపడాల్సి వుంది. జింబాబ్వే, ఐర్లాండ్‌, యూఏఈ లాంటి పసికూనల్నీ లైట్‌ తీసుకోడానికి వీల్లేని పరిస్థితి. సౌతాఫ్రికాపై విజయం సాధిస్తే, లీగ్‌ దాటేయడం పెద్ద కష్టమేమీ కాదు టీమిండియాకి. ఆ తర్వాత కప్పు సాధించాలనే కసి ఆటోమేటిగ్గా భారత ఆటగాళ్ళలో పెరిగిపోతుందనుకోండి.. అది వేరే విషయం.