పాక్‌పై భారత్‌ బంపర్‌ విక్టరీ

నో ఛేంజ్‌.. అదే రికార్డ్‌.. ఆధిపత్యం భారత్‌దే.. వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌ మరోమారు భారత్‌ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. భారత బ్యాట్స్‌మెన్‌ని నిలువరించడంలో విఫలమైన పాకిస్తాన్‌, పసలేని భారత బౌలింగ్‌నీ తట్టుకోలేకపోయింది. వెరసి.. భారత్‌కి…

నో ఛేంజ్‌.. అదే రికార్డ్‌.. ఆధిపత్యం భారత్‌దే.. వరల్డ్‌ కప్‌లో పాకిస్తాన్‌ మరోమారు భారత్‌ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. భారత బ్యాట్స్‌మెన్‌ని నిలువరించడంలో విఫలమైన పాకిస్తాన్‌, పసలేని భారత బౌలింగ్‌నీ తట్టుకోలేకపోయింది. వెరసి.. భారత్‌కి 76 పరుగుల విక్టరీ లభించింది.

కాస్సేపు పాక్‌ బ్యాట్స్‌మెన్‌ మిస్బావుల్‌ హక్‌ కంగారు పెట్టినా, టీమిండియా విజయం నల్లేరు మీద నడకలానే సాగిపోయింది. ఏ దశలోనూ భారత్‌పై పాక్‌ ఒత్తిడి తీసుకురాలేకపోయింది. ఫలితం.. అడిలైడ్‌లో భారత్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓటమి చవిచూసింది. ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లోనే ఘనవిజయం సాధిస్తే.. పాకిస్తాన్‌ పరాజయం పాలయ్యింది.

భారత బ్యాట్స్‌మెన్‌ విషయానికొస్తే కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. పాకిస్తాన్‌పై వరల్డ్‌ కప్‌లో భారత్‌ తరఫున సెంచరీ చేసిన ఒక్క మొనగాడు కోహ్లీ కావడం గమనార్హం. బౌలింగ్‌ లెక్కల్లోకి వెళితే షమీ నాలుగు వికెట్లు తీశాడు. ఉమేష్‌ యాదవ్‌ రెండు వికెట్లు, మొహిత్‌ శర్మ రెండు వికెట్లు, అశ్విన్‌, జడేజా చెరో వికెట్‌ తీశారు.