ప్చ్.. హాఫ్ సెంచరీ కూడా లేదాయె

బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించడం వేస్ట్‌. ఎందుకంటే, ఎలాగైనా వికెట్‌ చేజారిపోతుంది. ఫాస్ట్‌ బౌలర్‌కయితే పెద్దగా పనే లేదు. స్పిన్‌ బౌలింగ్‌దే రాజ్యం. ఫీల్డింగ్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. అలవాటైన పిచ్‌లు కావడంతో…

బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించడం వేస్ట్‌. ఎందుకంటే, ఎలాగైనా వికెట్‌ చేజారిపోతుంది. ఫాస్ట్‌ బౌలర్‌కయితే పెద్దగా పనే లేదు. స్పిన్‌ బౌలింగ్‌దే రాజ్యం. ఫీల్డింగ్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు. అలవాటైన పిచ్‌లు కావడంతో టీమిండియా బ్యాట్స్‌మన్‌ కాస్త బెటర్‌గా రాణిస్తున్నారంతే. సౌతాఫ్రికా మరీ దారుణం. 

నాగపూర్‌లో టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇప్పటిదాకా మూడు ఇన్నింగ్స్ పూర్తయినా ఒక్కటంటే ఒక్క అర్థ సెంచరీ కూడా నమోదు కాలేదు. నాలుగో ఇన్నింగ్స్ (సౌతాఫ్రికాకి రెండో ఇన్నింగ్స్)లో అయినా అర్థ సెంచరీ నమోదవుతుందేమో చూడాలి. ఈ మ్యాచ్లో ఇప్పటివరకూ ఓ బ్యాట్స్‌మెన్‌ ఎదుర్కొన్న అత్యధిక బంతుల సంఖ్య 106. భారత వికెట్‌ కీపర్‌ సాహా ఈ ఘనతను దక్కించుకున్నాడు. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు మురళీ విజయ్‌ సాధించాడు. అతను సాధించిన పరుగులు 40. రెండో ప్లేస్‌ శిఖర్‌ ధావన్‌ది అతని ఖాతాలో 39 పరుగులు పడ్డాయి. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో డుమిని సాధించిన 35 పరుగులే అత్యధికం. ఇదేమి టెస్టురా బాబోయ్‌.. అని క్రికెట్‌ అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. భారత క్రికెట్‌ అభిమానులైతే పండగ చేసేసుకుంటున్నారు. 

మ్యాచ్‌లో రెండు రోజులు పూర్తి కాలేదుగానీ, మూడు ఇన్నింగ్స్‌లు ముగిసిపోయాయి. మొత్తం 30 వికెట్లు నేల కూలాయి. టీమిండియా రెండు ఇన్నింగ్స్‌లు ఆడేస్తే, సౌతాఫ్రికా ఒక ఇన్నింగ్స్‌ ఆడేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులు చేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. సౌతాఫ్రికా విజయలక్ష్యం ఇప్పుడు 310 పరుగులు. 

నాగపూర్‌ పిచ్‌ కండిషన్‌ని బట్టి చూస్తే, భారత స్పిన్నర్ల జోరు చూస్తే మూడో రోజు మధ్యాహ్నానికే మ్యాచ్‌ ముగిసిపోయే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడం దాదాపు ఖాయమే.