నవ్వించడానికి ఇప్పుడు తెలుగులో వందల మంది కమెడియన్స్ రెడీగా వున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం నవ్వించడంలో తిరుగులేని కమెడియన్ ఆ స్థానం ఇప్పటికీ ఆయన లేదని ఒక సర్వేలో తేలిందట. బ్రహ్మానందం పని అయిపోయిందనీ, ఆయన కామెడీకి నవ్వు రావడంలేదనీ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదట.
జనం బ్రహ్మానందం కామెడీనే లైక్ చేస్తున్నట్లు యూ ట్యూబ్ రికార్డులు తెలియజేస్తున్నాయట. బ్రహ్మానందాన్ని పెట్టుకోలేని కొంతమంది నిర్మాతలు అలా అసత్య ప్రచారం చేసి, జబర్దస్త్ గ్యాంగ్‌ని ప్రోత్సహిస్తున్నారే తప్ప బ్రహ్మానందం కామెడీకి సాటి రాగలవారు ఇంతవరకూ తెలుగులో రాలేదనే చెప్పాలి. 30 ఇండస్ట్రీ అంటూ వచ్చిన పృధ్వీరాజ్ ఎప్పటికీ ఆయనకు ప్రత్యామ్నాయం కాలేడని ఇండస్ట్రీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు.
మిగతా కమెడియన్లు అయినాసరే, బ్రహ్మానందానికి సాటిరాలేరు. బ్రహ్మీతో చెత్త కామెడీ చేయించి దర్శక నిర్మాతలు బోర్ కొట్టించేస్తున్నారుగానీ, సరిగ్గా వాడుకుంటే బ్రహ్మానందం తర్వాతే ఎవరైనా అని ప్రేక్షకులైనా, సినీ ప్రముఖులైనాసరే ఒప్పుకుని తీరాల్సిందే. ఈ విషయమే సర్వేలోనూ వెల్లడయ్యిందట.