చరణ్ సినిమాపై రెండు వెర్షన్లు

  Advertisement రామ్ చరణ్..బ్రూస్ లీ తరువాత ఏ సినిమా చేస్తాడు..అన్నదానిపై ఒకంతట క్లారిటీ రావడం లేదు. బ్రూస్ లీ విడుదలకు ముందు వినిపించిన థని ఒరువన్ రీమేక్ పై ఇప్పుడు రెండు వెర్షన్లు…

 

రామ్ చరణ్..బ్రూస్ లీ తరువాత ఏ సినిమా చేస్తాడు..అన్నదానిపై ఒకంతట క్లారిటీ రావడం లేదు. బ్రూస్ లీ విడుదలకు ముందు వినిపించిన థని ఒరువన్ రీమేక్ పై ఇప్పుడు రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఒకటి ఆ సినిమా చేయడం లేదన్నది. ఈ ప్రాజెక్టు చేయడం అల్లు అరవింద్ కు అంతగా ఇష్టం లేదని..అలా నాన్చుతున్నారని ఆ వెర్షన్ వివరణ వైనం. 

కానీ మరో వెర్షన్ పూర్తిగా డిఫరెంట్ గా వినిపిస్తోంది. థని ఒరువన్ పై వర్కవుట్ చేస్తున్నారని, సురేంద్ర రెడ్డి డైరక్టర్ గా ఫిక్సయ్యాడనీ. శృతి హాసన్ ను నాయికగా అనుకుంటున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తాడు..త్వరలో ఈ మేరకు మీడియా నోట్ ఇస్తారని. డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో షూటింగ్ కు కొబ్బరి కాయ కొడతారనీనూ..

ఈ రెండో వెర్షన్ వినపడుతున్నా కూడా, ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కదన్న టాక్ మాత్రం పోవడం లేదు. అల్లు అరవింద్ ఓ సినిమాను చరణ్ తో చేస్తారు కానీ, అది స్వంత కథతో తప్ప, థని ఒరువన్ కాదు అని, ఆయనకు సరైన కథ దొరికే వరకు ఈ ప్రాజెక్టును చావకుండా, బతకకుండా నాన్చుతారని గ్యాసిప్ వినిపిస్తోంది. 

ఈ సంగతులు అన్నీ ఎలా వున్నా..ఇప్పడు మొదలు పెడితే తప్ప, సమ్మర్ వేళకు సినిమా రావడం కష్టం. మరి చరణ్ అయిడియా ఏమిటో?