సరైన హిట్ కోసం శ్రమిస్తున్న హీరో…డిజాస్టర్ అందించిన డైరక్టర్..మరో డిజాస్టర్ ను అందించిన నిర్మాత కలిసి అందిస్తున్న సినిమా ' కళ్యాణ్ వైభోగమే'..అలా మొదలైంది తరువాత సరైన హిట్ ను చవిచూడలేదు రంజిత్ మూవీస్..పైగా ఈ మధ్య దర్శకుడు తేజ తో కలిసి, అద్భుత కళాఖండాన్ని హోరా హోరీ అంటూ అందించారు. ఇక డైరక్టర్ నందినీ రెడ్డి అలా మొదలైంది తరువాత సిద్దార్థ-సమంతలతో జబర్దస్త్ అంటూ..తన వంతుగా ఓ డిజాస్టర్ అందించారు. దాంతో ఆమెకు మళ్లీ చాన్స్ రాలేదు. ఇక పుట్టిల్లే ఆదుకోక తప్పలేదు. ఆ విధంగా ఈ ప్రాజెక్టు సెట్ అయింది..
ఇప్పుడు ఈ ప్రాజెక్టులో నిర్మాత, డైరక్టర్ల కన్నా నాగశౌర్య పొజిషన్ నే కాస్త బెటర్. చేతిలో నాలుగైదు ప్రాజెక్టులువున్నాయి. నందినీ రెడ్డి ఫ్యూచర్ కు ఈ సినిమా మస్ట్ గా హిట్ కావాలి..అలాగే రంజిత్ మూవీస్ అసలే కాస్త దెబ్బతిని వున్నారు. వారికీ హిట్ కావాలి. ఈ సినిమాలో నాగశౌర్య సరసన మాళవిక నాయర్ (ఎవడే సుబ్రహ్మణ్యం హీరోయిన్) నటిస్తోంది. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. మాంచి యూత్ ఫుల్ ,కాంటెంపరరీ సబ్జెక్ట్ అని, ఈసారి విజయం గురి తప్పదని యూనిట్ ధీమాగా వుంది. మరి గెలిచి తీరాల్సిన పరిస్థితి కాబట్టి, కాస్త ఆశ పెట్టుకోవచ్చేమో సినిమాపై.