ఒకప్పుడు యువరాజ్ సింగ్ క్రీజ్‌లో ఉన్నాడంటే టీం ఇండియా తప్పక విజయం సాధిస్తుందనే భరోసా ఉండేది. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాది క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. యువరాజ్ ఆడేతీరు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. మైదానంలోనూ, మైదానం వెలుపల ఆటగాళ్లతో కలివిడిగా ఉంటూ స్నేహానికి యువరాజ్ ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వడం చూశాం.
క్యాన్సర్‌పై విజయం సాధించి జీవితమనే ఆటలో కూడా యువరాజ్ కనబరిచిన క్రీడా స్ఫూర్తి అభిమానులకు ఎంతో స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ, మాజీ క్రికెటర్ యువరాజ్ మధ్య స్నేహం ప్రత్యేకమైంది. వీళ్లద్దరి మధ్య బోలెడంత కామెడీ కూడా నడుస్తూ ఉంటుంది. ఇద్దరిలోనూ సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువే. వాళ్ల మధ్య అలాంటి ఎపిసోడ్ ఒకటి నడిచింది.
తాజాగా రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో రొమాంటిక్ ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా రోహిత్ …‘ మీరు ప్రేమించే దానిని ఎప్పుడూ పట్టుకునే ఉండండి’ అని తనదైన శైలిలో భార్యపై ఇష్టాన్ని వ్యక్తపరిచాడు. ఈ ఫొటో, కామెంట్లపై రోహిత్ కొంటె స్నేహితుడు యువరాజ్ వినూత్నంగా స్పందించాడు.
‘రోహిత్.. నీ బుగ్గలు అంటే నాకు ఇష్టం. వాటిని పట్టుకోనా’ అని తన స్నేహితుడిపై ప్రేమను ప్రకటించాడు. అయితే స్నేహితుడి సరదా కామెంట్‌పై ఒక అభిమాని స్పందిస్తూ… దీనికి రితికా పర్మిషన్ తీసుకోవాలంటూ యువీకి కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి రోహిత్ తన భార్యతో రొమాంటిక్‌గా ఉన్న ఫొటో, కామెంట్‌కు , యువీ కామెడీ జత కావడం సోషల్ మీడియాలో నవ్వులు వికసింపజేసింది. జీవితం అన్న తర్వాత కాస్తా కళా పోషణ ఉండాలని పెద్దలు ఊరికే చెప్పలేదు. డిప్రెషన్ నుంచి ఇలాంటి సరదా కామెంట్స్ రిలీఫ్ ఇస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.