బతికున్న కూతుర్ని పాతిపెట్టిన తండ్రి

ఇదొక దారుణమైన ఘటన. బిడ్డ పుట్టి జస్ట్ 15 రోజులు మాత్రమే అయింది. అంతలోనే ఆ పసికందును బతికుండగానే పాతిపెట్టాడు ఆ తండ్రి. పాకిస్తాన్ లో జరిగింది ఈ ఘటన. Advertisement పాక్ లోని…

ఇదొక దారుణమైన ఘటన. బిడ్డ పుట్టి జస్ట్ 15 రోజులు మాత్రమే అయింది. అంతలోనే ఆ పసికందును బతికుండగానే పాతిపెట్టాడు ఆ తండ్రి. పాకిస్తాన్ లో జరిగింది ఈ ఘటన.

పాక్ లోని సింధు ప్రాంతంలో ఉన్న తయ్యబ్ కు పాప పుట్టింది. అయితే పుట్టుకతోనే శిశువు ఓ వ్యాధితో బాధపడుతోంది. చికిత్సకు తండ్రి దగ్గర డబ్బు లేదు. అందుకే పాపను బతికుండగానే సమాధి చేశాడు.

పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయాలు బయటపెట్టాడు తయ్యబ్. కోర్టు ఆదేశాలతో సమాధిని తవ్వి, శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

పాక్ లో పేదరికం రాజ్యమేలుతోంది. గ్రామీణ జనాభాలో 37శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన నివశిస్తున్నారు. పాకిస్థాన్ సగటు కంటే ఇది ఎక్కువ. ఇక సింధ్ ప్రాంతంలో దుర్భర పరిస్థితులు వర్ణణాతీతం. లీటరు పాలు కొనాలంటే పాక్ లో 370 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో పేదలు బతకడం కష్టంగా మారింది. కనీసం రొట్టెలకు పిండి కూడా కొనుక్కోలేని పరిస్థితిలో 23 శాతం మంది ప్రజలున్నారు. దీంతో దేశంలో ఆకలిచావులు పెరిగాయి.

ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూతురుకు చికిత్స చేయించలేని ఆ తండ్రి, బతికుండగానే పాతిపెట్టాడు. తప్పు తండ్రిదా, చేతకాని ప్రభుత్వానిదా?

One Reply to “బతికున్న కూతుర్ని పాతిపెట్టిన తండ్రి”

Comments are closed.