తన మాజీ ప్రేయసి లావణ్యపై ఆరోపణలు చేసే క్రమంలో, ఆమె శీలాన్ని శంకించాడు హీరో రాజ్ తరుణ్. మస్తాన్ అనే వ్యక్తితో లావణ్య అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. తను కింద గదిలో ఉంటే, పై గదిలో వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉండేవారని అన్నాడు.
2 రోజులుగా నడుస్తున్న ఈ వివాదంలోకి ఇప్పుడు మస్తాన్ ఎంటరయ్యాడు. తనకు, లావణ్యకు మధ్య ఉన్న బంధాన్ని రాజ్ తరుణ్ తప్పుగా అర్థం చేసుకున్నాడని అంటున్నాడు.
“లావణ్యతో నేను క్లోజ్ గానే ఉంటాను. ఆ విషయం రాజ్ తరుణ్ కు కూడా తెలుసు. కానీ అతడు ఆరోపిస్తున్నట్టు నేను లావణ్యతో లివ్-ఇన్ లో లేను. రాజ్ తరుణ్ కింద రూమ్ లో ఉంటే, పైన గదిలో నేను, లావణ్య తలుపులేసుకొని ఉన్నామనే ఆరోపణ తప్పు. లావణ్యను ఎప్పుడూ రాజ్ తరుణ్ నుంచి విడదీయాలని నేను అనుకోలేదు. మేమిద్దరమే రూమ్ లోకి వెళ్లి తలుపులేసుకున్న సందర్భాల్లేవ్. క్యాజువల్ గా కూర్చొని మాట్లాడుకుంటాం.”
తనపై, లావణ్యపై డ్రగ్స్ కేసు పడిన తర్వాత ఆ కేసుపై చర్చించేందుకు తను ఎక్కువగా లావణ్య ఇంటికి వెళ్లానని, ఈ 2 నెలల్లో ఓ 15 సార్లు వెళ్లి ఉంటానని, ఆ మాత్రం దానికే రాజ్ తరుణ్ అపార్థం చేసుకున్నాడని అంటున్నాడు మస్తాన్.
అటు లావణ్య కూడా ఇదే మాట చెబుతోంది. మస్తాన్ తో తనకు అక్రమ సంబంధం లేదని, తను రాజ్ తరుణ్ తో మాత్రమే సహజీవనం చేస్తున్నానని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది.