ప్రేమించిన యువతి దక్కదనే నిరాశతో ఏకంగా కాల్పులకు తెగబడ్డాడో ప్రేమికుడు. అనంతరం తాను కూడా అదే గన్‌తో ప్రాణాలు తీసుకున్నాడు. తీవ్ర సంచలనం రేకెత్తించే ఈ దుర్ఘటన నెల్లూరు జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన మాలపాటి సురేష్‌రెడ్డి, పొలకూరు కావ్య సాప్ట్‌వేర్ ఇంజనీర్లు. ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగం చేసేవారు.
పరస్పరం ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఊరు చేరుకున్నారు. ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. కావ్య ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది. ప్రేమలాంటి పిచ్చి వేషాలు వేయొద్దని మందలించారు.
మరోవైపు కావ్య తల్లిదండ్రులను ఒప్పించేందుకు మధ్యవర్తుల ద్వారా సురేష్ ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రేమికురాలి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ తనతో కావ్య పెళ్లి జరిపించేందుకు అంగీకరించరని సురేష్ ఓ అభిప్రాయానికి వచ్చాడు.
కావ్య లేకుండా జీవితాన్ని ఊహించలేకపోయాడు. తనకు దక్కని కావ్య బతక్కూడదనే కఠిన నిర్ణయానికి వచ్చాడు. సోమవారం కావ్యపై తుపాకితో కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న కావ్యను స్థానికులు 108లో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచింది.
సురేష్ సైతం తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విషాదాంతంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
Very sad
కులపిచ్చి తో బిడ్డని పోగొట్టు కున్నారు. వేరే కులం వాడితో పెళ్లి చేస్తే ఏమైతది. అయినా ఆ అమ్మాయి ఆ.శాడిస్టు.గాని.ఎలా ప్రేమించిందో
Why love has become so violent?
నీ శాడిస్ట్ ప్రేమ ఏం ప్రేమ రా – నువ్వు నీ చావు చావొచ్చు కదా – ఆ పిల్ల ని చంపి నువ్వు కాల్చు కోవటం ఉన్మాదం రా