జిఆర్​మహర్షి ​– హీరోయిజంపై ‘తప్పడ్​’

1. కుక్కలు తరిమితే కోర్టులో చోరీ – ఆనం వివేకా బతికి వుంటే ఇదేందయా, నేనెప్పుడూ ఇనలేదే నేవాడు. Advertisement 2 వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావాలనుకునే పార్టీ బీజేపీ –…

1. కుక్కలు తరిమితే కోర్టులో చోరీ – ఆనం వివేకా బతికి వుంటే ఇదేందయా, నేనెప్పుడూ ఇనలేదే నేవాడు.

2 వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావాలనుకునే పార్టీ బీజేపీ – హరీశ్​రావు  – అధికారం కోసం లక్ష అబద్ధాలు ఆడినా తప్పులేదు.

3. సక్సెస్​ రావాలంటే హీరోలతోనే నటించాలని రూల్​ లేదు ​– తాప్సీ – హీరోయిజంపై ‘తప్పడ్​’ (చెంపదెబ్బ)

4. పేదలు ఏలే రాజ్యం కోసం బీజేపీ పోరాటం – బండి సంజయ్​  – మీరు అధికారంలో వున్న ఏ రాష్ట్రంలోనైనా పేదలు ఏలుతున్నారా సార్​?

5. మోదీ నిజం మాట్లాడరు – రాహులు – అధికారం, నిజం ఇవి రెండూ వ్యతిరేక పదాలు

6. మోదీ పాలనలో మత సామరస్యం – కేంద్రమంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ – బాస్​ ఈజ్​ ఆల్వేస్​ రైట్​ అబ్బాస్​

7. మేకని నరికేముందు మెడ నిమరడమే రాజకీయం

8. గోదారికి వరద, రాజకీయాల్లో బురద సహజం

9. మీడియా ఆవేదన – కెమెరా కనిపిస్తే చాలు ప్రతివాడు చిరుతపులిలా దూకుతున్నాడు.

10. తిరుపతి సామెత – మాడవీధుల్లో తిరిగినంత మాత్రానా కుక్క ఏనుగవుతుందా?