ఖుషి టైటిల్ తో శివనిర్వాణ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరచిపోలేని సినిమా ఖుషి. అందులో పవన్ నటన కానీ, ఆ సినిమా లెవెల్ కానీ ఓ రేంజ్ లో అలరిస్తాయి. అలాంటి టైటిల్ ను మళ్లీ వాడాలని…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరచిపోలేని సినిమా ఖుషి. అందులో పవన్ నటన కానీ, ఆ సినిమా లెవెల్ కానీ ఓ రేంజ్ లో అలరిస్తాయి. అలాంటి టైటిల్ ను మళ్లీ వాడాలని అనుకుంటున్నారు దర్శకుడు శివనిర్వాణ.  

సమంత-విజయ్ దేవరకొండ ల కాంబినేషన్ లో చేయబోయే సినిమాకు ఇదే వర్కింగ్ టైటిల్. మరి టైటిల్ ను పర్మనెంట్ టైటిల్ చేస్తారా? చేయరా? అన్నదే చూడాలి. 

మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమా ఈ నెలలోనే ప్రారంభమై, జస్ట్ 80 రోజుల్లో పూర్తవుతుందని తెలుస్తోంది. పూర్తి లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా షూట్ ఎక్కువగా కాశ్మీర్ లో జరుగుతుంది. 

నిన్ను కోరి, మజిలి, టక్ జగదీష్ తరువాత శివనిర్వాణ అందిస్తున్న సినిమా ఇది. మానవ సంబంధాలు, భావోద్వేగాలు కలగలిసిన కథలు రాసుకునే శివనిర్వాణ ఇప్పుడు అదే లైన్ లో పూర్తి ప్రేమ కథ ను సినిమాగా ప్లాన్ చేసారు.