కాఫీ తాగితే రొటీన్.. రాసుకుంటే వెరైటీ

కాఫీ అందరూ తాగుతారు. కాఫీ చుక్క పడకపోతే రోజు గడవని వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే కాఫీ తాగడం రొటీన్, అదే కాఫీని ముఖానికి రాసుకోవడం వెరైటీ అంటోంది నేటి యూత్. గ్లామర్ ను…

కాఫీ అందరూ తాగుతారు. కాఫీ చుక్క పడకపోతే రోజు గడవని వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే కాఫీ తాగడం రొటీన్, అదే కాఫీని ముఖానికి రాసుకోవడం వెరైటీ అంటోంది నేటి యూత్. గ్లామర్ ను పెంచుకోవడం కోసం కాఫీని రకరకాలుగా వాడేస్తోంది.

మరీ ముఖ్యంగా ఈ వేసవిలో కాఫీ ప్యాక్స్ చాలా ఉపయోగం. ఇంతకీ అందాన్ని పెంచుకునేందుకు కాఫీ అంతలా పనిచేస్తుందా? దీన్ని ఎలా వాడాలి? చూద్దాం..

చాలా ఉత్పత్తుల్లో ఉన్నట్టుగానే కాఫీలో కూడా యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి. అయితే వీటితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కాఫీలో ఉన్నాయి. అందుకే కాఫీ ప్యాక్ ముఖానికి చాలామంచిదంటున్నారు బ్యూటీషియన్లు.

మృతకణాల్ని తొలిగించే మెరిసే చర్మాన్ని అందిస్తుంది కాఫీ. మొటిమలతో పోరాటంలో సహకరించడంతో పాటు.. ఎండ వేడికి కమిలిపోయిన చర్మానికి ఉపశమనం అందిస్తుంది. కాఫీ స్క్రబ్స్ ను వారానికి 2-3 సార్లు వాడితే చర్మం నునుపుగా తయారవ్వడంతో పాటు అన్ని రకాల బ్యాక్టిరియాలు, కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

కాఫీని ఫేస్ మాస్క్ గా రాసుకుంటే ముఖంపై రక్త ప్రసరణను వేగవంతం చేసి, కాంతినిస్తుంది. అంతేకాదు.. టేబుల్ స్పూన్ గ్రౌండ్ కాఫీలో పాలు కలిపి ముఖానికి పట్టిస్తే, ఇందులోని ఆరోగ్యకర కారకాలు ముఖంపై ఉన్న మట్టి, మృతకణాల్ని వేగంగా తొలిగిస్తుంది.

కంటి కింద చారల్ని తొలిగించడానికి కూడా కాఫీ ఉత్తమంగా పనిచేస్తుంది. నిజానికి చాలా అండర్-ఐ క్రీమ్స్ లో కాఫీ ఉత్పత్తుల్నే వాడుతుంటారు.

ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..