ఇక విశాఖ నుంచే జగన్ పాలన….?

జగన్ ముఖ్యమంత్రి. ఆయన పాలన ఎక్కడ నుంచి అయినా చేయవచ్చు. రాజ్యంగంలో రాజధాని అన్న దాని మీద సరైన నిర్వచనం ఏదీ ఇవ్వలేదని రాజ్యంగ కోవిదులు చెబుతున్నారు. Advertisement అంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంచ్టే…

జగన్ ముఖ్యమంత్రి. ఆయన పాలన ఎక్కడ నుంచి అయినా చేయవచ్చు. రాజ్యంగంలో రాజధాని అన్న దాని మీద సరైన నిర్వచనం ఏదీ ఇవ్వలేదని రాజ్యంగ కోవిదులు చెబుతున్నారు.

అంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంచ్టే అక్కడ నుంచే పాలన సాగుతుంది. ఈ సాకేతిక అంశాలే ఇపుడు జగన్ని విశాఖ వైపుగా నడిపిస్తున్నాయి అంటున్నాయి. జగన్ విశాఖ నుంచి పాలించేందుకు సర్వం సిధ్ధం చేసుకున్నారు అని అంటున్నారు.

మే నెల 6వ తేదీ నుంచి జగన్ విశాఖ నుంచే పాలన ప్రారంభిస్తారని చెబుతున్నారు. మంచి రోజులు, ముహూర్తాలు మే నుంచి ఉండడంతో జగన్ పండితుల సలహాతోనే ఆ శుభ వేళ విశాఖ నుంచే పాలనకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు.

ఇక మూడు రాజధానుల వ్యవహారం కోర్టులో ఉంది.  అమరావతి రాజధానిగా ఉంచాలంటూ కోర్టులో కేసులు దాఖలైన సంగతి విధితమే. అయితే కోర్టు తీర్పు ఎలా ఉన్నా ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పాలించాలి అన్నది మాత్రం పూర్తిగా ఆయనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ విషయంలో ఇతర జోక్యాలు ఏవీ  ఉండవు అంటున్నారు. 

మరో వైపు చూస్తే ఈ విద్యా సంవత్సరం మొదలుకాక ముందే ఉద్యోగులు విశాఖ తరలివచ్చేలాగానే జగన్ మే నెలను ఎంచుకున్నారని అంటున్నారు.

ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..