కియరా అద్వానీ..తెలుగులో రెండు సినిమాలు చేసి మెరుపులా మాయమైన హీరోయిన్. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్న హీరోయిన్.
ఇప్పుడు అదే హీరోయిన్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
శంకర్ సినిమా కావడం, దిల్ రాజు ఈ మధ్య జెర్సీ పనుల మీద ముంబాయిలో కాస్త సర్కిల్ ను తెచ్చుకోవడంతో కియరా చేత ఓకె అనిపించినట్లు తెలుస్తోంది. జూలైలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తారు.
మరి కియారా డేట్ లు దొరక్క పోతే ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ కి మళ్లీ పూజా హెగ్డే దగ్గరకే వెళ్తారో ? లేక రష్మిక పేరు పరిశీలిస్తారో చూడాలి.