ఎమ్బీయస్‌ :జిగేల్‌ మనిపించి ఫటేల్మన్న జిగ్నేష్‌ షా

భారత్‌లో అతి పెద్ద స్టాక్‌ కుంభకోణాల్లో ఒకటిగా తోస్తున్న నేషనల్‌ స్పాట్‌ ఎక్స్‌ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఇఎల్‌) ప్రమోటర్లపై ముంబయి పోలీసు సెప్టెంబరు మాసాంతంలో విరుచుకుపడ్డారు. రూ.5600 కోట్ల చెల్లింపుల సంక్షోభానికి సంబంధించి, ప్రమోటర్లు, డైరక్టర్లు, బ్రోకర్ల…

భారత్‌లో అతి పెద్ద స్టాక్‌ కుంభకోణాల్లో ఒకటిగా తోస్తున్న నేషనల్‌ స్పాట్‌ ఎక్స్‌ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఇఎల్‌) ప్రమోటర్లపై ముంబయి పోలీసు సెప్టెంబరు మాసాంతంలో విరుచుకుపడ్డారు. రూ.5600 కోట్ల చెల్లింపుల సంక్షోభానికి సంబంధించి, ప్రమోటర్లు, డైరక్టర్లు, బ్రోకర్ల నివాసాలపై మొత్తం 16 రాష్ట్రాలలో 184 ప్రాంగణాల్లో ఆర్థిక నేరవిభాగం సోదాలు చేసింది. ఈ స్థాయిలో మోసం జరగడానికి కారణం ఆ కంపెనీ ప్రమోటర్‌ అయిన జిగ్నేశ్‌ షాకు రాజకీయనాయకులతో వున్న బలమైన సంబంధాలే! స్పాట్‌ ట్రేడిరగులో, ఫార్వార్డ్‌ ట్రేడిరగులో దిట్టగా పేరు తెచ్చుకున్న అతని మూల సంస్థ jైున ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్‌ (ఎఫ్‌టి)లో అనేకమంది రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టారని అందరూ అనుకుంటున్నారు. అనిల్‌ అంబానీ సొంత కంపెనీ రిలయన్సు కాపిటల్‌ ట్రస్టీ యిటీవల దాకా ఎఫ్‌టిలో వాటాలు కలిగి వుంది. అంతేకాదు, జిగ్నేశ్‌ ఎమ్‌సిఎక్స్‌ అనే పేర కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌ 2003లో పెడితే దాన్ని ప్రారంభించడానికి ముకేశ్‌ అంబానీ వచ్చాడు. ఆ కంపెనీ తన కార్యకలాపాలు విస్తరిస్తూ ఎంసిఎక్స్‌-ఎస్‌ఎక్స్‌ నెలకొల్పుతానంటే మొదట్లో తటపటాయించినా దానికి అనుమతులు యిచ్చినది ప్రణబ్‌ ముఖర్జీ. ఈ ఏడాది దాని కార్యకలాపాలు ప్రారంభించినది – సాక్షాత్తూ ఆర్థికమంత్రి పి.చిదంబరం! జిగ్నేశ్‌కు దన్నుగా నిలబడి, అతని కంపెనీ కార్యకలాపాలను ఫైనాన్సు శాఖ పరిధిలోకి వెళ్లకుండా తన శాఖలోనే వుండేట్లు చూసినది శరద్‌ పవార్‌!

ఇంతమంది పెద్దలు వెనకుండగా జిగ్నేశ్‌ను వ్యతిరేకించిన సెబి చైర్మన్‌ సి బి భావే మాజీ అయిపోవడంలో ఆశ్చర్యం లేదు. సెబి డైరక్టర్‌ కె ఎం అబ్రహామ్‌, అతను సహోద్యోగి ఎం.ఎస్‌.సాహూలను పక్కకు నెట్టేశారు. జిగ్నేశ్‌ కంపెనీని విమర్శించిన ఆర్థికవేత్త అజయ్‌ షాను పరువునష్టం దావా వేసి కోర్టుకి యీడ్చారు.  ఎన్‌ఎస్‌ఇఎల్‌ను రెగ్యులేటరీ కంట్రోలు నుండి మినహాయింపు యిస్తూ ప్రభుత్వం 2007లోనే ఆర్డర్లు పాస్‌ చేసింది. కమోడిటీ ట్రేడిరగుకు 11 రోజుల పరిమితి వున్నా ఎన్‌ఎస్‌ఇఎల్‌ 25-34 రోజుల కాంట్రాక్టులు చేసుకునేది. గోడౌన్లలో సరుకులు లేకుండానే వున్నట్టు దొంగ రసీదులు పుట్టించి వాటితో లావాదేవీలు చేసేవారు. గోడౌన్ల ఓనర్లగా, ఇన్వెస్టర్లగా కనబడే పేర్లు బినామీవి అని బయటపడిరది. ఈ లసుగులను ఫార్వార్డ్‌ మార్కెట్స్‌ కమిషన్‌ (ఎఫ్‌ఎంసి) కనిపెట్టి యూనియన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ కన్స్యూమర్‌ ఎఫయిర్స్‌కు 2012 ఏప్రిల్‌లోనే తెలియపరచింది. అయినా ప్రభుత్వం యిప్పటివరకు ఏ చర్యా తీసుకోలేదు. ఏదైనా కఠిన చర్య తీసుకుందామంటే ఎఫ్‌ఎంస్‌కు అధికారాలు యివ్వలేదు. ఎఫ్‌ఎంస్‌లో పని చేసే అధికారులను, సెబిలో పని చేసే అధికారులను ఎంసిఎక్స్‌ ప్రలోభపెట్టి తన కంపెనీలో ఉద్యోగాలు యిచ్చింది.

వాళ్లు దీనిలో చేరేముందు తమ అధికారాలు దుర్వినియోగం చేసి యీ కంపెనీకి అనేక రాయితీలు కల్పించారు. ఎన్‌ఎస్‌ఇఎల్‌ కొనుగోలుదార్లకు 15% లాభాలు సమకూరుస్తూ వస్తూంటే ఎవరికీ అనుమానం రాలేదు. ఇన్నాళ్లకు బండారం బయటపడి రూ.5600 కోట్లు ఇన్వెస్టర్లకు వెనక్కి యిమ్మంటే కంపెనీ చేతులు ఎత్తేస్తోంది. 

మన్‌మోహన్‌ సర్కారులో తలెత్తిన స్కాములను వేళ్లపై లెక్కించాలంటే సహస్రబాహుడైన కార్తవీర్యార్జునుడికైనా సాధ్యం కాదేమో!

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]