ఇవి ‘గబ్బర్‌సింగ్‌-2’ డైలాగులేనా?

పవన్‌కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌-2’ సినిమాలోని డైలాగుల్ని మర్చిపోవడం అంత తేలిక కాదు. ఆ సినిమా డైలాగులు అంతగా ప్రేక్షకుల మదిలో విశేషంగా చోటు సంపాదించేశాయి మరి. మళ్ళీ పవన్‌కళ్యాణ్‌…

పవన్‌కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌-2’ సినిమాలోని డైలాగుల్ని మర్చిపోవడం అంత తేలిక కాదు. ఆ సినిమా డైలాగులు అంతగా ప్రేక్షకుల మదిలో విశేషంగా చోటు సంపాదించేశాయి మరి. మళ్ళీ పవన్‌కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌-2’ చేస్తున్నాడని తెలియగానే అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

అందుకే, ఆ సినిమాకి సంబంధించిన ఏ వార్త అయినా హాట్‌ టాపిక్‌ అవుతోంది. ‘గబ్బర్‌సింగ్‌-2’ సినిమాకి సంపత్‌ నంది దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని డైలాగులు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇటీవలి కాలంలో చాలా సినిమాలకు సంబంధించిన డైలాగ్స్‌ ఇలానే మీడియాలో నానేస్తున్నాయి లీకుల రూపంలో. అయితే వాటిల్లో కొన్ని నిజంగానే సినిమాల్లో దర్శనమిస్తున్నాయనుకోండి.. అది వేరే విషయం. కొందరు ఔత్సాహికులు.. తమ అభిమాన హీరోని దృష్టిలో పెట్టుకుని సరదాగా రాసుకున్న డైలాగుల్ని నెట్‌లో పెట్టేస్తుంటే, అవి యధాతథంగా మీడియాలో కన్పించేస్తున్నాయి.

మరి, ‘గబ్బర్‌సింగ్‌-2’ విషయంలో మీడియాలో నానుతున్న డైలాగులు ఒరిజినలా.? లేదంటే, జస్ట్‌ ఫర్‌ ఫన్‌.. పవన్‌ అభిమానులెవరైనా అలా తయారు చేసుకున్నారంటారా.? ఏమో మరి, సంపత్‌ నంది క్లారిటీ ఇస్తే బావుంటుందేమో.