ఎమ్బీయస్‍: తగ్గించడం తెలుసన్న రేవంత్

పైగా ఇవాళ వచ్చినట్లుగా సినిమా పరిశ్రమ పెద్దలు ఎప్పుడూ రేవంత్‌ను కలిసి మాటామంతీ కలిపింది లేదు.

‘‘తగ్గేదేలే…’’ అంటూ యావద్భారతంలో దూసుకుపోతున్న పుష్పరాజ్‌ను గ్లోబల్‌గా నీకెంతైనా ఉండనీ, లోకల్‌గా నేనే దాదా అని చూపించడానికి రేవంత్ చేసిన ప్రయత్నం ఫలిస్తూన్నట్లే ఉంది. సినిమా పెద్దలు దిల్ రాజ్ ద్వారా ఆయన్ను యివాళ కలిశారు.

దిల్ రాజు బయటకు వచ్చి ఏవో పొంతన లేని కబుర్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, అల్లు అర్జున్ అనే ఒక్క వ్యక్తిపై బ్రహ్మాస్త్రం వేస్తున్నట్లు నటించి, రేవంత్ యావత్తు సినిమా యిండస్ట్రీని తన దారికి తెచ్చుకుంటున్నారు.

ఇది రాజకీయ క్రీడ. దానిలో భాగంగా రేవంత్ ఏదైనా మాట్లాడవచ్చు, శపథాలు చేయవచ్చు, రేప్పొద్దున్న వెనక్కి తగ్గవచ్చు. కానీ యీ లోపున మీడియా, సోషల్ మీడియా, కొందరు సామాజిక కార్యకర్తలని చెప్పుకునే వారు మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు నాకు విస్మయం కలిగించాయి, చికాకు పుట్టించాయి.

తెలుగు సినిమా యిండస్ట్రీ చంద్రబాబుని తప్ప మరెవర్నీ ముఖ్యమంత్రిగా గుర్తించడానికి యిష్టపడదు. ఆయన ఆంధ్రకు ముఖ్యమంత్రి కాగానే వారు చేసిన అడావుడి చూశాం. ఆయన మారి జగన్ వచ్చాక వెళ్లి గ్రీట్ కూడా చేయలేదు, పట్టించుకోలేదు. ఆంధ్రలో వాళ్లకు మార్కెట్ ఉంది కానీ, ఆస్తులు లేవు. పరిశ్రమ తెలంగాణలోనే ఉంది. అందువలన జగన్ వారిని వంచడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు.

టిక్కెట్ల పెంపు శాస్త్రీయంగా ఉండాలంటూ పద్ధతి మార్చేటప్పటికి సినిమా వాళ్లు, మీడియా గగ్గోలు పెట్టేశాయి. ‘ఇది ప్రయివేటు వ్యాపారం, దీనిలో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకోగలదు? అభిమానులు ప్రేమతో, యిష్టంగా హెచ్చు రేట్లు యిస్తున్నారు. మేం పుచ్చుకుంటున్నాం. మధ్యలో ప్రభుత్వానికి ఏం తీపు తీసింది?’ అంటూ. మరి యిప్పుడు తెలంగాణ ప్రభుత్వం ‘నో బెనిఫిట్ షోస్, నో హెచ్చు రెట్లు’ అంది ఎవరైనా కిక్కురుమంటున్నారా? ఎక్కడికి పోయాయి ఆ వాదనలన్నీ?

హైదరాబాదులో ఆస్తులున్నంత కాలం చిత్రపరిశ్రమ ప్రవర్తన, మీడియా హౌసెస్ ప్రవర్తన యిలాగే ఉంటుంది. కెసియార్ తెలంగాణ ముఖ్యమంత్రి కాగానే సినిమా పరిశ్రమను దడిపించాడు. రాఘవేంద్రరావుకి ప్రభుత్వం స్థలం యిచ్చిన పర్పస్ ఏమిటి? అక్కడ ఆయన నడుపుతున్నదేమిటి? వంటి ప్రశ్నలు ఉద్యమకాలం నుంచి వేస్తూ వచ్చాడు. అధికారంలోకి రాగానే నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ని అడలగొట్టాడు. అయ్యప్ప సొసైటీలో ఫ్లాట్లు కూల్చాడు. దెబ్బకి చిత్ర పరిశ్రమ దాసోహం అంది. కెసియార్ అహం చల్లారింది.

‘మీకు వేరే ఊళ్లో స్థలాలు యిస్తాను. అక్కడ మరో ఫిల్మ్‌నగర్ కట్టండి. ఈ ఫిల్మ్‌నగర్ స్టూడియోలను షాపింగు కాంప్లెక్స్‌లుగా మార్చుకోండి. నేను అనుమతించేస్తాను.’ అని వరాలు కురిపించాడు. తెరాస హయాం నడిచినంత కాలం తలసాని యాదవ్, కెటియార్ సినిమా వాళ్లతో భుజాలు రాసుకుని తిరిగారు.

2023 వచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. కాంగ్రెసులో ఎవరూ ఊహించని రీతిలో రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా కాంగ్రెసులో ముఖ్యమంత్రి పదవి ఐదేళ్లూ ఉంటుందన్న గ్యారంటీ లేదు. అధిష్టానం అనే ఏనుగు ఏ దారిన పోయేవాడి మెడలోనైనా దండ వేయగలదు. రేవంత్‌కు పక్కలో బల్లెంలా భట్టి విక్రమార్క మాత్రమే ఉన్నారనుకోకూడదు. కోమటిరెడ్డి, ఉత్తమ్… యిలా లిస్టు పెద్దగానే ఉంది. ఒక్క ఉపయెన్నికలో ఓడిపోతే చాలు, లేదా వచ్చే ఏడాది జరిగే హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికల్లో సెట్‌బాక్ వస్తే చాలు, రేవంత్‌కో హటాఓ, పార్టీకో బచాఓ అని పైరవీలు ప్రారంభమై పోతాయి.

ఇది తెలిసిన రేవంత్ ‘కాంగ్రెసుకే తనే దిక్కు, కెసియార్‌ను నిలవరించ గలిగిన మొనగాడు ఓలుమొత్తం పార్టీలో తను మాత్రమే. తనను తీసేస్తే పార్టీకి అధోగతే!’ అని ప్రొజెక్టు చేసుకోవడానికే చాలా సమయం వెచ్చిస్తున్నాడు. తనను కెసియార్‌తో సమానమైన ప్రత్యర్థిగా ప్రొజెక్టు చేసుకుంటున్నాడు. అది ఏ మేరకు సబబు అనేది వేరే వ్యాసంలో చర్చిద్దాం.

ప్రస్తుతాంశం ఏమిటంటే రేవంత్ ‘నేనే యిక్కడ షంషేర్. నా దగ్గరకు అందరూ వచ్చి దణ్ణాలు పెట్టాలి.’ అనే మూడ్‌లో ఉన్నాడు. తెరాస ఎమ్మెల్యేలను ఫిరాయింప చేసుకోవడం సరే, ఎంతటి పారిశ్రామిక వేత్తయినా సరే, వచ్చి తన దగ్గర హాజరేయించు కోవాలి. కెసియార్ పరివారాన్ని, తెరాసను పూర్తిగా విస్మరించాలి. ఆ విధంగా తెరాసను పూర్తిగా నిర్మూలించి వేసి తన అధికారానికి ఛాలెంజ్ లేకుండా చేసుకోవాలి అనే దీర్ఘకాలిక ప్రణాళికలో ఉన్నాడు.

గతంలో కెసియార్ చేసినదీ యిదే. ఆయన పార్టీకి అధ్యక్షుడిగా చేసినది, యిక్కడ సామంతరాజుగా ఉంటూ రేవంత్ చేద్దామనుకుంటున్నాడు. దీనిలో ఏదైనా తప్పటడుగు వేసి, బోల్తా పడితే ప్రత్యామ్నాయంగా ముందుకు వద్దాం అని పార్టీలో ప్రత్యర్థులు ఎదురు చూస్తున్నారు.

అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ దూకుడుగా వెళ్లిపోతూ ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ప్రతి దానిలో కలగ చేసుకునే భట్టి విక్రమార్క దీనిలో మాత్రం మౌనంగా ఉండడం గమనార్హం. ఇవాళ్టి మీటింగుకి హాజరయ్యాడు కానీ, చురుకైన పాత్ర తీసుకోలేదు. రేవంత్ ఎజెండాలో ఉన్న ప్రధాన పరిశ్రమ – సినిమా యిండస్ట్రీ. దానిపై ఆయనకు చాలా కినుక ఉంది. తను ‘‘గద్దర్ ఎవార్డులు’’ ప్రకటిస్తే దానికి వాళ్లు జేజేలు పలకలేదని అలక ఉంది. నంది అనగానే లేపాక్షిలో విగ్రహం, దాని అలంకారం గుర్తుకు వస్తాయి. పురాణాల్లో నందీశ్వరుడు పరమ శివుడు తాండవ నృత్యం చేసినప్పుడు పక్కనే ఉంటాడు.

నటన, అభినయం అనేవి నాట్యం లోంచి వచ్చినవే. నాట్యం అనగానే నటరాజు, అతని వాహనమైన నంది సంబంధిత వ్యక్తులుగా తోస్తారు. ఇది హిందూ సంప్రదాయం. దీన్ని తోసిరాజని, ఒక వ్యక్తి ఐన గద్దర్ పేరు అవార్డులకు పెడతాననడ మేమిటి? పైగా గద్దర్ చిత్ర పరిశ్రమకై కృషి చేసిన వ్యక్తి కాదు. ఒక తీవ్రవాది. పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకి. కళాకారుడే, కానీ ఒక వర్గమే అతన్ని ఆదరిస్తుంది. అందరికీ ఆమోదయోగ్యుడు కాడు. వాళ్ల అమ్మాయి కాంగ్రెసులో చేరింది కదాని, అతని పేరును నందికి బదులుగా పెడతానంటే ఎవరు హర్షిస్తారు? కావాలంటే విప్లవ సినిమాలకు ఒక ఎవార్డు పెట్టి దానికి అతని పేరు పెడితే పోయేది. పౌరాణిక సినిమా తీసి గద్దర్ పేర అవార్డు తీసుకోవడానికి దర్శకుడు ఎంత సిగ్గు పడతాడో ఊహించుకోవచ్చు. పేరు మార్చే ముందు తను చిత్రసీమలో ఎవర్నీ సంప్రదించ లేదు కానీ వాళ్లు భేష్, భేష్ అనలేదని రేవంత్‌కు బాధ.

పైగా ఇవాళ వచ్చినట్లుగా సినిమా పరిశ్రమ పెద్దలు ఎప్పుడూ రేవంత్‌ను కలిసి మాటామంతీ కలిపింది లేదు. పరిశ్రమ తరఫున ఆయనను సత్కరించిన వార్తలూ నేను చదవలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గొడవ రాగానే రేవంత్ ఆ కసంతా తీర్చేసుకున్నారు.

‘‘ఇండియా టుడే’’ కాన్‌క్లేవ్‌లో ‘‘సినిమా వాళ్లేమైనా గొప్ప పని చేస్తున్నారా? వాళ్లేమైనా సైనికులా? సినిమాలు చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు.’’ అని తూష్ణీభావంతో మాట్లాడారు. అక్కడ అడిగిన ప్రశ్నేమిటి? ఏదైనా ఫంక్షన్‌కి వచ్చిన జనంలో ఎవరైనా చనిపోతే లేదా గాయపడితే, వచ్చిన అతిథి ఏ మేరకు బాధ్యుడు? అని. ‘ఉదాహరణకి మీరు హాజరైన యీ సమావేశంలోనే ఫయర్ ఏక్సిడెంటు అయి, ఎవరైనా పోతే మీరు బాధ్యులా?’ అని అడిగితే, రేవంత్ ‘నేను మీ మీద నమ్మకంతో వచ్చాను.’ అంటూ అసందర్భ సమాధానం యిచ్చారు.

దానితో పాటు ‘‘సినిమా వాళ్లు..’’ అంటూ పై సమాధానం యిచ్చారు. ‘ఒకవేళ ఫంక్షన్ ఏదైనా సైనికుడి గౌరవార్థం జరుగుతూ అదే దుర్ఘటన జరిగితే అప్పుడు తెలంగాణ పోలీసు సైనికుడిపై కేసు పెట్టరా? సైనికుడు తప్ప తక్కిన ఏ వృత్తిలో ఉన్నా యీ దండనా తప్పదా? రాజ్యాంగంలో సైనికులకు యీ విషయాల్లో ప్రత్యేకమైన వెసులుబాట్లు ఉన్నాయా?’ అనే అనుమానం వస్తాయి.

సినిమా వాళ్లు వ్యాపారం చేస్తారు.. అనేది అభిశంసనా? వాళ్లు వచ్చి వ్యాపారం చేస్తేనే ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం, అనేక కుటుంబాలకు ఉపాధి కల్పన! అందుకే ప్రపంచంలో ఉన్న వ్యాపారస్తులందరినీ తెలంగాణకు రమ్మనమంటూ దావోస్‌కీ, లావోస్‌కీ వెళ్లి పిలవడం! మరి సినిమా వాళ్ల దగ్గరకు వచ్చేసరికి అదేదో అసాంఘిక కార్యకలాపం అనే టోన్‌లో మాట్లాడడం దేనికి? ఈ రోజు సినిమా వాళ్లందరూ కట్టకట్టుకుని హాజరయ్యేసరికి అదే రేవంత్ ‘సినిమా పరిశ్రమ అంటే ఐటీ, ఫార్మాలతో సమానమైన పరిశ్రమ’ అంటూ ప్రశంసించారు. కొన్ని వారాల్లోనే టోన్ మారిపోయిందే!

ఇవాళ్టి మీటింగు అయిపోగానే దిల్ రాజు బయటకు వచ్చి ‘‘పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ఎలా? అన్నదానిపైనే సిఎం చర్చించారు. హాలీవుడ్ సినిమాలు కూడా యిక్కడ తీసే స్థాయికి హైదరాబాదును ఇంటర్నేషనల్ సినిమా హబ్‌గా మారుస్తామని చెప్పారు.’’ అన్నారు. ఈ హబ్ కబుర్లు చెప్పడంలో అగ్రతాంబూలం చంద్రబాబుది. గురువును దాటి పోవాలని రేవంత్ ప్రయత్నించడాన్ని నేను ఖండిస్తున్నాను. ఈ ముక్క చెప్పడానికి యింతమంది సినీ ప్రముఖులతో, అంతమంది కాబినెట్ మంత్రులతో సమావేశం నిర్వహించాలా!? దాదాపు గంట సేపు వాళ్లను వెయిట్ చేయించాలా? ఎలాగూ కాబినెట్ సబ్-కమిటీ వేస్తారు. వాళ్లు ప్రతిపాదనలు చేశాక, అప్పుడే పిలిచి అన్ని వర్గాల వారి రెస్పాన్సు తెలుసుకుంటే పోయేది.

అయినా రేవంత్ రమ్మన్నంత మాత్రాన హాలీవుడ్ వాళ్లు వచ్చేస్తారా? వాళ్లు వస్తే జనం గుమిగూడితే, వాళ్లలో ఎవరికైనా ఏమైనా అయితే యాక్టరు కిచ్చే ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో అర్థమయ్యాక సాహసిస్తారా? హాలీవుడ్ లేదా బాలీవుడ్ నటి, నటుడు సైనికుడు అయుంటే చర్య తీసుకోరు కానీ లేకపోతే మా వాళ్లను పని గట్టుకుని చంపేశారని కేసు పెట్టేయగలదు రేవంత్ ప్రభుత్వం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్‌గా హైదరాబాదును మారుస్తున్నాం, మీకేమైనా అభ్యంతరాలుంటే చెప్పండి అని ప్రభుత్వం పిలిస్తే తెలుగు సినిమా వాళ్లందరూ వెళ్లేవారా? అబ్బే, అందుకే రేవంత్ వీళ్లకు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టాడు. అల్లు గొడవను ఆలంబనగా చేసుకుని ‘ఇకపై టిక్కెట్ రేటు పెంపు లేదు, బెనిఫిట్ షోలు లేవు’ అని ప్రకటించేశాడు. దెబ్బకి హీరోలతో సహా పెద్ద నిర్మాతలు, దర్శకులు అందరూ పరిగెత్తుకుని వచ్చారు.

ఎందుకంటే వాటిపై వచ్చే ఆదాయాన్ని నమ్ముకునే పెద్ద పెద్ద బజెట్‌లతో సినిమాలు తీస్తున్నారు. సినిమా నాణ్యత బయటపడే లోపునే మొదటి వారంలో డబ్బు నొల్లేసుకోవాలి. అభిమానులకు, యితర సినీ వేలంవెర్రిగాళ్లకు కిర్రెక్కించి, మొదటి మూడు రోజుల్లో సినిమా చూడకపోతే జన్మ వ్యర్థం అనిపించేట్లు చేయాలి. మాకు యిన్ని కోట్లు ఖర్చయింది, అన్ని కోట్లు ఖర్చయింది, హీరోకి వంద కోట్లిచ్చాం, డైరక్టరుకి ఏభై కోట్లిచ్చాం, అలాటిది మీరు కొన్ని వేలు ఖర్చు పెట్టడానికి ఏడుస్తారేమిటి? అని ప్రేక్షకులను కవ్వించి రప్పిస్తున్నారు. ఇలాటి భ్రమలో పడి సామాన్యులు నష్టపోతున్నారు. రేవతి కుటుంబం కేస్ చూడండి. ఆవిడ చనిపోయింది కాబట్టి, ఆవిడ కొడుకు బెడ్ మీద ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడినా బాడ్ టేస్ట్‌లో మాట్లాడారని, జాలీ దయా లేకుండా మాట్లాడరని నింద పడాల్సి వస్తుంది కానీ కాస్సేపు ఎమోషన్స్ పక్కన పెట్టి ఆలోచించి చూడండి.

సిఎం గారు చెప్పిన ప్రకారం ఆ భాస్కర్‌కి నెలకు 30 వేలు జీతం. ఆ రోజు సినిమా చూడడానికి 12 వేలు ఖర్చు పెట్టింది ఆ కుటుంబం. టిక్కెట్‌కి 3 వేలు చొప్పున అని సిఎం చెప్పారు. అదెలాగో తెలియలేదు. తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది సింగిల్ స్క్రీన్‌లో రూ. 800 కదా! అది 3 వేలు ఎలా అయింది? ఎలా అవనిచ్చారు? బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మనిచ్చారా? 30వేల జీతం వచ్చే కుటుంబం 12 వేలు సినిమా టిక్కెట్టు మీదే ఖర్చు పెడితే, (వచ్చే పోయే ఖర్చులు, మధ్యలో తిండి ఖర్చు అదనం) యిక తక్కిన రోజుల్లో తినడానికి ఏం మిగులుతుంది? అదేమైనా సంసారం చేసే లక్షణమా? రేవతి గారు చనిపోయింది కాబట్టి, ఈ రోజు అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు కాబట్టి, అతనిపై హత్యాప్రయత్నం కేసు పెట్టి యాగీ చేశారు కాబట్టి, టిక్కెట్టు పెంపు ఉండదంటూ తక్కిన సినిమా పరిశ్రమను అడలగొట్టారు కాబట్టి, అంతా కలిసి కోట్లాది రూపాయలిచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్నారు కానీ రేవతి గారు చావు దాకా వచ్చి బతికి పోయిందనుకోండి, వైద్యానికి బాగా ఖర్చయ్యేది కదా! ఆ కుటుంబం భరించగలిగేదా? పోనీ అర్జున్ అక్కడికి రాకపోయినా ఆ ఘటన జరిగిందనుకోండి. ఆ వైద్యం ఖర్చూ అదీ ఆ కుటుంబమే భరించాల్సి వచ్చేది కదా!

అర్జున్ రాకపోతే అలా జరిగేదే కాదు అని ఎవరూ అనవద్దు ప్లీజ్. రద్దీలో చనిపోవడ మనేది అతనితో ప్రారంభం కాలేదు, అతనితో అంతం కూడా కాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సినిమా ప్రారంభం రోజు టిక్కెట్లకై హోరాహోరీ పోరాటం చేసి చొక్కాలు చింపుకుని, స్పృహ తప్పిపోయి, దెబ్బలు తిన్నవాళ్లెందరో! ఒకూళ్లో ఓ సినిమా థియేటర్ కొత్తగా ప్రారంభమైంది. మొదటి టిక్కెట్టు సంపాదించే క్రమంలో ఒకతను దాదాపు చచ్చిపోయినంత పనైంది. థియేటరు నిర్మాణ సమయంలో జంతుబలి యివ్వలేదని అందుకని నరబలి కోరిందనే మాట ఊళ్లో వ్యాపించింది. థియేటరు వాళ్లకు భయం పట్టుకుంది. ఆ వ్యక్తికి చికిత్స చేయించి అతని చేత ‘బతికే ఉన్నాను, థియేటరు వాళ్లు కాపాడారు’ అని పత్రికా ప్రకటన యిప్పించారు. ఇది నా చిన్నప్పటి మాట.

రానురాను సినిమా ప్రారంభం రోజున దున్నపోతులను బలి యివ్వడాలు, హాల్లో విన్యాసాలు ఎక్కువై పోయాయి. పుష్ప 2 సినిమా హాల్లో అభిమానులు చేసిన సందడి చూస్తే అగ్ని ప్రమాదం సంభవిస్తుందన్న భయం వేసిందని జిఆర్ మహర్షి రాశారు. వీటన్నిటికీ తెగించి, ఒక సామాన్యుడు, అదీ కుటుంబంతో, తొలి రోజు సినిమాకు వెళ్లాలా? ఈ ఘటనలో బాధితులు కాబట్టి భాస్కర్ గారిని మనం యీ ప్రశ్నలు అడగలేము. కానీ యీ రకంగా బాధితులు కాని అనేకమందిని యీ ప్రశ్న అడగాలనిపిస్తుంది. వీళ్లంతా సినిమా హైప్ ప్రభావితులు. సినిమా హైప్ ఒకటే కాదు, మతపరమైన హైప్, షో హైప్ యిలా చాలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో హాథ్రస్‌లో ఆ మధ్య భోలే బాబాకి చూడడానికి వచ్చి 117 మంది పోయారు. చెన్నయ్‌లో ఎయిర్ షో అని పెడితే 5 గురు పోయారు. పుష్కరాల్లో పోయారు, కుంభమేళాలో పోయారు. వీటికి వెళ్లేవాళ్లందరికీ రిస్కు ఉంటుందని తెలుసు, అయినా హైప్ ప్రభావంలో పడి వెళతారు.

జగన్ సినిమా టిక్కెట్లు తగ్గించినపుడు ఒకాయన చాలా హర్షిస్తూ నాతో ఫోన్‌లో మాట్లాడాడు. ‘‘కొత్త సినిమా రిలీజైతే పనివాళ్లు దొరక్కుండా పోతున్నారండి. కూలి డబ్బుల దగ్గర అంతంత బేరాలాడతారు కదా. రోజు కూలీ వదులుకుని, అంత టిక్కెట్టు పెట్టి మొదటి రోజే వెళ్లాలా? అని అడిగితే వెళ్లకపోతే ఎలాగండి? అంటున్నారు. మల్టీ నేషనల్స్ మన పిల్లలకు బ్రాండెడ్ షర్టులూ, బూట్లూ అలవాటు చేశారు. అవి వేసుకోకపోతే వాళ్లు హీనంగా ఫీలవుతారు. అలాగే వీళ్లూనూ. టిక్కెట్టు రేటు తగ్గించేసి మామూలు సినిమాయే అనే కలరింగు యిస్తే వీళ్లందరికీ క్రేజ్ తగ్గుతుంది.’ అన్నాడాయన. కానీ సినిమా వాళ్లు క్రేజ్ తగ్గనివ్వరు. అంతేకాదు, దీనికి అడ్డుపడేవాళ్లని క్షమించరు కూడా! అందుకే సినిమా సమీక్షకులపై విరుచుకు పడడం, మేం దోచుకోవడం పూర్తయ్యేదాకా నెగటివ్ రివ్యూ రాస్తే శిక్షించాలంటూ డిమాండు చేయడం!

‘సినిమాకు హైప్ పెంచడానికే అర్జున్ థియేటరుకి వెళ్లాడు, అందువలన శిక్షార్హుడు’ అని కొందరు ప్రవచిస్తున్నారు, అదేదో అతనితోనే ప్రారంభమైనట్లు! సినిమా వాళ్లు మామూలుగా బయట కనబడరు. తమ సినిమా వస్తోందంటేనే వాళ్లు టీవీల్లో యింటర్వ్యూలు యిస్తారు. ప్రి రిలీజ్ ఫంక్షన్లకి, ఆడియో రిలీజుకి, ప్రదర్శించే థియేటరుకి వచ్చి హైప్ పెంచుతారు. అలా రాకపోతే నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శకులు ఊరుకోరు. సినిమా ప్రమోషన్‌కి రావాలని అగ్రిమెంటులో కూడా రాయించుకుంటా రనుకుంటాను. నయనతార అలా చేయదనే అమెపై దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. ఇక్కడ అర్జున్ తన వర్క్ ప్లేస్‌కే వెళ్లాడు. వర్క్ అంటే షూటింగు జరిగే చోటు మాత్రమే కాదు, ప్రమోషన్‌ కూడా అతని వర్క్‌లో భాగమే. చంద్రబాబు గోదావరి పుష్కరాల సమయంలో తను వెళ్లాల్సినది విఐపి ఘాట్ కైతే, సాధారణ ప్రజల ఘాట్‌కు వెళ్లారు. ఫలితం చూశాం.

బాబు ఒకరే కాదు, ప్రతి రాజకీయ నాయకుడు జనాల్ని పోగేయడానికి చూస్తారు. తమని చూసి రారని, సినిమా వాళ్లను తమ సభలకు పిలిపిస్తారు, చీరలిస్తాం, బీరులిస్తాం అంటూ ఆశలు కల్పిస్తారు. ఇరుకు సందుల్లో మీటింగు పెట్టి కిక్కిరిసిపోయినట్లు బిల్డప్ యిస్తారు. వీటివలన ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది చావు దాకా వెళ్లారో నేను లెక్కలు యివ్వనక్కరలేదు. వీటిని నివారిద్దామని మైదానాల్లో మాత్రమే మీటింగులు పెట్టాలని జగన్ జీవో తెస్తే నానా యాగీ చేశారు. వాళ్లంతా యిప్పుడేమంటారో! రేవతి చావుకి అర్జున్ కారకుడంటూ అతనిపై కల్పబుల్ హోమిసైడ్ కేసు పెట్టారే! మరి యీ రాజకీయ నాయకులపై, భోలే బాబాపై, చెన్నయ్ ఎయిర్ షో నిర్వాహకులపై కేసులు పెట్టాలా? వద్దా?

రేవంత్ వస్తూనే తన తడాఖా చూపడానికి నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ని కూలగొట్టించాడు. తర్వాత కొందరు తెరాస నాయకుల బిల్డింగులతో పాటు మిడిల్ క్లాస్ వాళ్ల యిళ్లు కూడా కూల్పించాడు. వెంటనే పేదల యిళ్లపైకి వెళ్లాడు. దాంతో అయ్యో పేదలు అనే జాలివాన కురిసింది. అంతే హైడ్రాకు కళ్లెం వేశారు. నిజంగా అక్రమ నిర్మాణాలు తొలగించే పద్ధతి అదా? వరుసగా పెద్ద వాళ్లు చెరువుల్లో కట్టేసిన బిల్డింగులన్నీ కొట్టేసుకుంటూ వస్తే యీ పబ్లిక్ ఔట్‌క్రై ఉండేది కాదు. గొప్పోళ్లకు శాస్తి జరిగింది అంటూ సంతోషించేవారు. కానీ రేవంత్‌కు కావలసినది పర్యావరణ సంరక్షణం కాదు, పెద్ద తలకాయలను అడలగొట్టడం, వ్యవహారం కోర్టులో ఉన్నా నేను లెక్క చేయను, నన్ను ఎవరూ అడ్డుకోలేరు అని వారికి సందేశం పంపడమే లక్ష్యం.

ఇప్పుడు అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తున్నట్లే చేసి, మొత్తం సినిమా ఇండస్ట్రీని తన దగ్గరకు తెప్పించుకున్నాడు. ఎలా? ఇకపై బెనిఫిట్ షోలుండవు, టిక్కెట్టు పెంపు ఉండదు అని భయపెట్టి! దెబ్బకు అందరూ పరిగెట్టుకుని వచ్చారు. దాదాపు గంట సేపు వెయిట్ చేయబెట్టి అప్పుడు దర్శనం యిచ్చి 20 ని.లలో తను చెప్పాల్సింది చెప్పేసి వెళ్లిపోయాడు. దిల్ రాజు బయటకు వచ్చి ‘పెంపు గురించి మాట్లాడనే లేదు, అది చాలా చిన్న విషయం, హైదరాబాదుకి హాలీవుడ్ తేవడం గురించే మాట్లాడాము’ అని చెప్పవచ్చు కాక, కానీ చూస్తూండండి, ఓ కమిటీ వేసి, ఆ వరాలు యిచ్చినా యివ్వవచ్చు. తెలంగాణ సంస్కృతి పెంపొందింపు అనే చిన్న మినహాయింపు పెట్టుకున్నారు కాబట్టి, యికపై సినిమాల్లో తెలంగాణపై ఒక పాటో, పద్యమో, ఒక నినాదమో ఉంటేనే ఆ కన్సెషన్లు యిస్తాం అని అన్నారనుకోండి, చాలు, వీళ్లు అవి పెట్టేసి, ఆ వెసులుబాటుని వాడుకుంటారు.

ఈ విధంగా పరిస్థితిని తన అదుపులో తెచ్చుకోవడానికి రేవంత్ గత కొన్ని రోజులుగా ఏమేం చేశారు, దానికి మొదటి పేరాలో చెప్పిన విమర్శకులు ఎలా దోహదపడ్డారు అనే విషయాలను ‘‘అల్లుపై విమర్శల జల్లు’’ అనే యింకో వ్యాసంలో ముచ్చటిస్తాను.

ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2024)

38 Replies to “ఎమ్బీయస్‍: తగ్గించడం తెలుసన్న రేవంత్”

  1. ఏం బాలేదు ఆర్టికల్… వితండవాదం లా ఉంది.

    వేరే వాళ్ళు డైరెక్ట్ చేసిన సినిమాకి VV వినాయక్ కి డబ్బులిచ్చి, తెరపై దర్శకత్వం VV vinayak అని వేసుకొన్నట్టు, ఈ ఆర్టికల్ మీద MBS వేసినట్టున్నారు.

    KCR అంటే ఇంకా అంత వణుకేంటో తమరికి.

  2. రవ్వంత రెడ్డి అహం చల్లార్చడానికి రాహుల్ రెఢీ గా వున్నాడు.

  3. Allu arjun ki siggunte year ki okati badhulu 2 movies theeyali, telangana lo release cheyakoodadu, thana remuneration oka 30% cut cheskovali. Telangana prajalaki dabbulu migultaayi, allu arjun sampaadana padipodu

  4. అల్లు అర్జున్ కి సిగ్గుంటే యేటా రెండు సినిమాలు తీసి తెలంగాణ లొ రిలీజ్ మానెయాలి. తన సంపాదన తగ్గదు. ప్రజల డబ్బులు మిగుల్తాయి.

  5. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్క చంద్రబాబు నాయుడును తప్ప వేరే ఎవ్వరినీ ముఖ్యమంత్రిగా గుర్తించడానికి ఇష్టపడరు.

    జగన్ ముఖ్యమంత్రి అయితే పట్టించుకోలేదు, కనీసం గ్రీట్ కూడా చేయలేదు. 100% నిజమే చెప్పారు సర్

  6. ఈ వ్యాసం చాలా అవగాహనారాహిత్యంతో రాశారు. అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటానికి, రోడ్డు షో చేయడానికి పోలీస్ అనుమతి లేదన్న విషయం విస్మరించారు. అతను చేసిన రోడ్ షో మూలంగానే థియేటర్ వద్ద రద్దీ పెరిగిందని తెలుసుకోలేదు. ఇండియా టుడే ఇంటర్వ్యూ లో రేవంత్ చెప్పినట్లు ఇంత వ్యాసం రాసినా ఆ చనిపోయిన స్త్రీ, ఆపదలో ఉన్న పిల్లవాడి గురించి కనీస ప్రస్తావన లేకుండా చేసి తను కూడా అందరిలాగానే మానవత్వం లేని జర్నలిస్టునని నిరూపించుకున్నారు.

  7. ఈ వ్యాసం చాలా అవగాహనారాహిత్యంతో రాశారు. అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటానికి, రోడ్డు షో చేయడానికి పోలీస్ అనుమతి లేదన్న విషయం విస్మరించారు. అతను చేసిన రోడ్ షో మూలంగానే థియేటర్ వద్ద రద్దీ పెరిగిందని తెలుసుకోలేదు. ఇండియా టుడే ఇంటర్వ్యూ లో రేవంత్ చెప్పినట్లు ఇంత వ్యాసం రాసినా ఆ స్త్రీ, ఆపదలో ఉన్న పిల్లవాడి గురించి కనీస ప్రస్తావన లేకుండా చేసి తను కూడా అందరిలాగానే మానవత్వం లేని జర్నలిస్టునని నిరూపించుకున్నారు.

  8. ఈ వ్యాసం చాలా అవగాహనారాహిత్యంతో రాశారు. అ..ల్లు అ..ర్జు..న్ థియేటర్ కి వెళ్ళి సినిమా చూడటానికి, రోడ్డు షో చేయడానికి పో..లీ..స్ అనుమతి లేదన్న విషయం విస్మరించారు. అతను చేసిన రోడ్ షో మూలంగానే థియేటర్ వద్ద రద్దీ పెరిగిందని తెలుసుకోలేదు. ఇండియా టుడే ఇంటర్వ్యూ లో రేవంత్ చెప్పినట్లు ఇంత వ్యాసం రాసినా ఆ స్త్రీ, ఆపదలో ఉన్న పిల్లవాడి గురించి కనీస ప్రస్తావన లేకుండా చేసి తను కూడా అందరిలాగానే మానవత్వం లేని జ..ర్న..లి..స్టు..నని నిరూపించుకున్నారు.

  9. ఈ వ్యాసం చాలా అవగాహనారాహిత్యంతో రాశారు. అ..ల్లు అ..ర్జు..న్ థి..యే..ట..ర్ కి వెళ్ళి సినిమా చూడటానికి, రో..డ్డు షో చేయడానికి పో..లీ..స్ అనుమతి లేదన్న విషయం విస్మరించారు. అతను చేసిన రోడ్ షో మూలంగానే థి..యే..ట..ర్ వద్ద ర..ద్దీ పెరిగిందని తెలుసుకోలేదు. ఇండియా టుడే ఇంటర్వ్యూ లో రే..వం..త్ చెప్పినట్లు ఇంత వ్యాసం రాసినా ఆపదలో ఉన్న పి..ల్లవా..డి గురించి కనీస ప్రస్తావన లేకుండా చేసి తను కూడా అందరిలాగానే మా..న..వత్వం లేని జ..ర్న..లి..స్టు..నని నిరూపించుకున్నారు.

  10. ఈ వ్యాసం చాలా అ..వగా..హనా..రా..హి..త్యంతో రాశారు. అ..ల్లు అ..ర్జు..న్ థి..యే..ట..ర్ కి వెళ్ళి సినిమా చూడటానికి, రో..డ్డు షో చేయడానికి అ..ను..మ..తి లేదన్న విషయం విస్మరించారు. అతను చేసిన రో..డ్ షో మూలంగానే థి..యే..ట..ర్ వద్ద ర..ద్దీ పెరిగిందని తెలుసుకోలేదు. ఇం..డి..యా టుడే ఇం..ట..ర్వ్యూ లో రే..వం..త్ చెప్పినట్లు ఇంత వ్యాసం రాసినా ఆపదలో ఉన్న పి..ల్లవా..డి గురించి కనీస ప్రస్తావన లేకుండా చేసి తను కూడా అందరిలాగానే మా..న..వత్వం లేని జ..ర్న..లి..స్టు..నని ని..రూ..పిం..చు..కున్నారు.

  11. ఈ వ్యా..సం చాలా అ..వగా..హనా..రా..హి..త్యంతో రాశారు. అ..ల్లు అ..ర్జు..న్ థి..యే..ట..ర్ కి వెళ్ళి సి..ని..మా చూడటానికి, రో..డ్డు షో చేయడానికి అ..ను..మ..తి లేదన్న విషయం విస్మరించారు. అతను చేసిన రో..డ్ షో మూలంగానే థి..యే..ట..ర్ వద్ద ర..ద్దీ పెరిగిందని తెలుసుకోలేదు. ఇం..డి..యా టుడే ఇం..ట..ర్వ్యూ లో రే..వం..త్ చెప్పినట్లు ఇంత వ్యాసం రాసినా ఆపదలో ఉన్న పి..ల్లవా..డి గురించి కనీస ప్రస్తావన లేకుండా చేసి తను కూడా అందరిలాగానే మా..న..వత్వం లేని జ..ర్న..లి..స్టు..నని ని..రూ..పిం..చు..కున్నారు.

  12. ఈ వ్యా..సం చాలా అ..వగా..హనా..రా..హి..త్యంతో రా..శా..రు. అ..ల్లు అ..ర్జు..న్ థి..యే..ట..ర్ కి వెళ్ళి సి..ని..మా చూడటానికి, రో..డ్డు షో చేయడానికి అ..ను..మ..తి లేదన్న విషయం వి..స్మ..రిం..చా..రు. అతను చేసిన రో..డ్ షో మూ..లం..గా..నే థి..యే..ట..ర్ వద్ద ర..ద్దీ పెరిగిందని తెలుసుకోలేదు. ఇం..డి..యా టుడే ఇం..ట..ర్వ్యూ లో రే..వం..త్ చెప్పినట్లు ఇంత వ్యా..సం రాసినా ఆ..ప..ద..లో ఉన్న పి..ల్లవా..డి గురించి కనీస ప్ర..స్తా..వ..న లేకుండా చేసి తను కూడా అందరిలాగానే మా..న..వ..త్వం లేని జ..ర్న..లి..స్టు..నని ని..రూ..పిం..చు..కున్నారు.

  13. ఈ వ్యా..సం చాలా అ..వగా..హనా..రా..హి..త్యంతో రా..శా..రు. అ..ల్లు అ..ర్జు..న్ థి..యే..ట..ర్ కి వెళ్ళి సి..ని..మా చూడటానికి, రో..డ్డు షో చేయడానికి అ..ను..మ..తి లేదన్న విషయం వి..స్మ..రిం..చా..రు.

  14. ఈ వ్యా..సం చాలా అ..వగా..హనా..రా..హి..త్యంతో రా..శా..రు. అ..ల్లు అ..ర్జు..న్ థి..యే..ట..ర్ కి వెళ్ళి సి..ని..మా చూడటానికి, రో..డ్డు షో చేయడానికి అ..ను..మ..తి లేదన్న విషయం వి..స్మ..రిం..చా..రు.అతను చేసిన రో..డ్ షో మూ..లం..గా..నే థి..యే..ట..ర్ వద్ద ర..ద్దీ పెరిగిందని తెలుసుకోలేదు.

  15. ఈ వ్యా..సం చాలా అ..వగా..హనా..రా..హి..త్యంతో రా..శా..రు. అ..ల్లు అ..ర్జు..న్ థి..యే..ట..ర్ కి వెళ్ళి సి..ని..మా చూడటానికి, రో..డ్డు షో చేయడానికి అ..ను..మ..తి లేదన్న విషయం వి..స్మ..రిం..చా..రు.అతను చేసిన రో..డ్ షో మూ..లం..గా..నే థి..యే..ట..ర్ వద్ద ర..ద్దీ పెరిగిందని తెలుసుకోలేదు. ఇంత వ్యా..సం రాసినా ఆ..ప..ద..లో ఉన్న పి..ల్లవా..డి గురించి కనీస ప్ర..స్తా..వ..న లేకుండా చేసి తను కూడా అందరిలాగానే మా..న..వ..త్వం లేని జ..ర్న..లి..స్టు..నని ని..రూ..పిం..చు..కున్నారు.

  16. ఈ వ్యా..సం చాలా అ..వగా..హనా..రా..హి..త్యంతో రా..శా..రు. అ..ల్లు అ..ర్జు..న్ థి..యే..ట..ర్ కి వెళ్ళి సి..ని..మా చూడటానికి, రో..డ్డు షో చేయడానికి అ..ను..మ..తి లేదన్న విషయం వి..స్మ..రిం..చా..రు.అతను చేసిన రో..డ్ షో మూ..లం..గా..నే థి..యే..ట..ర్ వద్ద ర..ద్దీ పెరిగిందని తెలుసుకోలేదు. ఇంత వ్యా..సం రాసినా ఆ..ప..ద..లో ఉన్న పి..ల్లవా..డి గురించి క..నీ..స ప్ర..స్తా..వ..న లే..కుం..డా చేసి త..ను కూడా మా..న..వ..త్వం లేని జ..ర్న..లి..స్టు..న..ని ని..రూ..పిం..చు..కున్నారు.

  17. ఇం..త వ్యా..సం రా..సి..నా ఆ..ప..ద..లో ఉన్న పి..ల్లవా..డి గు..రిం..చి క..నీ..స ప్ర..స్తా..వ..న లేదు. త..ను కూడా అందరిలాగానే మా..న..వ..త్వం లే..ని జ..ర్న..లి..స్టు..న..ని ని..రూ..పిం..చు..కు..న్నా..రు.

  18. sir,

    Article baagundhi….kaani konni points cover cheyyaledu…

    a). Meeru asalu AA ravadaaniki police la anumathi ledhu(police lu cheppina mata)…ayinaa aayana yenduku vachhinattu..

    b). Thanu theater lo vundaga okavida chanipoyinattu…police lu cheppinaa kadalakundaa interval daaka vundi velladam yenthavaraku samanjasam

    c). Ponee aayanaki tharvathi roje thelisindhi anukundaam(police lu abaddam chepparu anukunte)…..thana thappu lekapoyina..atleast moral responsibility kinda velli chuusi ravacchu kadhaa..

    AA goti tho poyedaaniki goddali daaka thechhu kunnaadu…cinema hit ayina aanandam mottam aaviri ayyipoyindhi

  19. ఇంత్కముంది వ్యాసాలు బానే రాశారు, ఇప్ప్పుడు ఏదో రాజకీయ దురుద్దేశంతో రాశారు అనిపిస్తుంది. దీనికి సమాధానం రాయాలని ఉంది కానీ నాకు అంత టైం లేదు, ఒక్కసారి మళ్ళీ చదివి ఆలోచించండి, మీకే సరియిన సమాధానాలు వస్తాయి. ముఖ్యంగా అక్రమ కట్టడాల మీద మరియు సంధ్య థియేటర్ సంఘటన మీద.

  20. de javue nothiong happens as usual the threatened and in a few months everything would be normal like hiking prices and morning shows would be allowed. This is common in Indian politicians , no enforcement of law

  21. టాలీవుడ్ ని తన దగ్గరకు రప్పించుకోడానికి సీఎం కు పెద్ద పనా? టికెట్ రేట్స్ పెంచను అంటే వాళ్లే పరుగెత్తుకు వస్తారు , దానికి అల్లు అర్జున్ ని జై/లు కు పంపనవసరం లేదు. ఆర్టికల్ లో ఆలోచన రాహిత్యం తొణికిసలాడుతుంది.

Comments are closed.