అప‌ర చాణ‌క్యుడు అస్త‌మ‌యం.. !

భారత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92)  క‌న్నుమూశారు. నిన్న‌ సాయంత్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఎమ‌ర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేప‌టికే మన్మోహన్ తుది…

భారత మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92)  క‌న్నుమూశారు. నిన్న‌ సాయంత్రం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఎమ‌ర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు. అయితే కొద్దిసేప‌టికే మన్మోహన్ తుది శ్వాస విడిచినట్టు వారు ప్రకటించారు.

చాలామంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేసిన మన్మోహన్.. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే అత్యధిక జీడీపీ 10.2శాతం వృద్ధిరేటు నమోదైంది. వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది. నెహ్రూ, ఇందిరా, మోదీ త‌రువాత అత్య‌ధిక కాలం దేశ ప్ర‌ధానిగా కొన‌సాగారు.

33 ఏళ్ల‌పాటు పార్ల‌మెంటు స‌భ్యుడిగా కొన‌సాగిన ఆయ‌న‌ 1991లో రాజ్య‌స‌భ‌లో అడుగుపెట్టారు. పీవీ న‌ర‌సింహ‌రావు హయాంలో ఆర్థిక మంత్రిగా ప‌నిచేశారు. ఆర్థిక శాఖలో సలహాదారుగా, కార్యదర్శిగా, ఆర్బీఐ గవర్నర్‌గా కూడా పనిచేశారు. 1932 సెప్టెంబ‌ర్ 26న ఇప్ప‌టి పాక్‌లోని చ‌క్వాల్‌లో మ‌న్మోహ‌న్ సింగ్ జ‌న్మించారు. 2004-2014 వ‌ర‌కు ప్ర‌ధానిగా ఆర్థిక సంస్క‌ర‌ణ‌లకు పెద్దపీట వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు పని క‌ల్పిస్తున్న ఉపాధి హామీ ప‌థ‌కాన్ని మ‌న్మోహ‌న్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు.

అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందుకు నడిపించారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొనియాడారు. తన గురువు, మార్గదర్శిని కోల్పోయానన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.

13 Replies to “అప‌ర చాణ‌క్యుడు అస్త‌మ‌యం.. !”

    1. నాయనా .. ఆయన కాబట్టి అటువంటి పరిస్దితులలో కూడా దేశానికి ఎంతో మేలు చేసాడు … ఇంకొకడైతే సోనియాకు కొంత నాకు కొంత అని దేశాన్ని నిలువునా ముంచేవాడు

  1. “చదువుకున్న ప్రధాని”, ఎకానమీ గురించి ప్రపంచానికే పాఠాలు చెప్పగల ఆచార్యుడు, వ్యక్తిగతంగా మచ్చలేని చంద్రుడు, నోటితో కాకుండా తన చేతలతో మాట్లాడిన సమర్థుడు, దేశాధినేతగా ఏ రంగం మీదనైనా అనర్గళంగా, స్క్రిప్ట్ లేకుండా సాధికారికంగా తమ ప్రభుత్వ వైఖరి సూటిగా, ఎవరినో నిందించకుండా చెప్పగల గొప్ప వక్త, ట్యాక్సులతో, పెట్రోల్ ధరలతో పీడించకుండా ఆర్థిక వ్యవస్థలో అదుపులో ఉంచగలిగిన ధీరుడు. ఇప్పుడున్నట్లు పూర్తి స్వతంత్రత, మెజారిటీ ఉండి ఉంటే దేశాన్ని మరింత గొప్పగా పాలించగలిగేవారు.

  2. పీవీ లాంటి ప్రధాని, మన్మోహన్ సింగ్ లాంటి ఫైనాన్స్ మినిస్టర్ నా భూతో న భవిష్యత్.

  3. అపర చాణక్యుడు ఎలా అయ్యాడు బాబు. సౌమ్యుడు , సోనియాకు అపర విధేయుడు, ఆర్ధిక శాస్త్రవేత్త , మచ్చలేని మనిషి అంతే. పీవీ కి క్రెడిట్ ఇవ్వకుండా ఆర్ధిక లిబరలైజేషన్కి మన్మోహన్ కివ్వడం ఇప్పుడు దేశం లో అందరు చేస్తున్న తప్పు. ఒక్క మోడీ నే మన్మోహన్ గురించి సరైన ట్వీట్ చేసాడు.

Comments are closed.