శ్రీకాకుళం జిల్లా దురదృష్టం చాలానే చెప్పాలి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నపుడు కానీ ఆ తర్వాత వేరుపడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నపుడు కానీ ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ అభివృద్ధికి అయితే పెద్దగా నోచుకోలేదు
ఈ రోజుకీ జిల్లా కేంద్రంగా ఉన్న శ్రీకాకుళం చూస్తే ఆ పరిస్థితి అర్ధం అవుతుంది. శ్రీకాకుళం విజన్ అంటూ ఎన్నో హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీలు నాయకులు అవి అమలు చేయడంలో మాత్రం ఎందుకో సరిగ్గా వ్యవహరించలేకపోయారు.
మరొక విషాదం ఏమిటి అంటే విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విద్యా సంస్థలు వెనకబడిన జిల్లాలలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. శ్రీకాకుళంలో ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా కేటాయింపు లేకపోవడం పట్ల అంతా ఆవేదన వ్యక్తం చేస్తారు.
ఈ జిల్లా నుంచి యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తాను అని అంటున్నారు. పెట్టుబడులను జిల్లాకు తీసుకుని వచ్చి పరిశ్రమల స్థాపనకు తన వంతుగా కృషి చేస్తాను అని చెబుతున్నారు.
ఎక్కడో వేరే చోట్లకు వలస వెళ్లి ఉపాధి కోసం పనిచేయడం కంటే ఉన్న చోటనే ఉపాధిని అందించే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తమని అంటున్నారు. దాని కోసం ఇన్వెస్ట్ ఇన్ శ్రీకాకుళం పేరిట జిల్లాలో తొలిసారిగా పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించనున్నట్లుగా కేంద్ర మంత్రి ప్రకటించారు. జిల్లాలో ఉద్యోగాల విప్లవాన్ని తీసుకుని వస్తామని ఆయన చెప్పడం జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లాలో ఏ పరిశ్రమల స్థాపనకు అనుకూల పరిస్థితులు ఉంటాయో చూసి వాటిని ఏర్పాటు చేసేందుకు చూస్తామని దాని కోసం పెట్టుబడుదారులను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి సంకల్పం మంచిది. అది ఆచరణలో కనుక ఫలవంతం అయితే శ్రీకాకుళానికి న్యాయం జరుగుతుంది అని అంటున్నారు.
అధికారం లో వున్నపుడు పత్తా లేని మా….డా గా..డు..ప్రజా ధర్బార్ లతో ఇప్పుడు షో చేస్తున్నాడు…ఎం చేస్తాడు ఇప్పుడు వాళ్ళ వినతులు తో?