ఇదేం నీతి రేవంత్: రాయితీలు వారికి.. వడ్డింపు అందరికా?

చిన్న సినిమాల ప్రేక్షకులు, సామాన్య ప్రేక్షకులందరినించీ ఇలా పిండుకోవాలని చూడడం కరక్టేనా అంటున్నారు.

అల్లు అర్జున్ పుణ్యమా అని సినీ పరిశ్రమకు- తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి మధ్య ఒక సంక్షోభ వాతావరణం ఏర్పడిందనే అభిప్రాయం బాగా ప్రజల్లోకి వెళ్లింది. నిజానికి అల్లు అర్జున్ గానీ, రేవంత్ రెడ్డి గానీ రెచ్చిపోకుండా వ్యవహారాల్ని బాగానే డీల్ చేశారు గానీ.. మధ్యలో బిజెపి, బిఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకుని.. తమ తమ రాజకీయ ప్రయోజనాలకోసం చేసిన ప్రకటనలు, రెచ్చగొట్టే మాటలు వల్ల ప్రతిష్టంభన పెరిగింది. మొత్తానికి ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి.. ఒక ఉపశమన సమావేశం నిర్వహించారు.

రేవంత్ కు ఆగ్రహం రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్న సినీ పరిశ్రమ పెద్దలందరూ వెళ్లి కలిశారు. సత్కారాలు కూడా చేశారు. రెండున్నర గంటలు భేటీ అయ్యారు.

సాధారణంగా ఇలాంటి సమావేశాలు షెడ్యూలు కాగానే.. వారికి ప్రీతికరంగా ఏయే మాటలు మాట్లాడాలో ముందే స్క్రిప్టు తయారైపోతుంది కాబట్టి.. రేవంత్ రెడ్డి తదనుగుణంగానే నాలుగు మాటలు చెప్పారు. హాలీవుడ్ కూడా హైదరాబాదుకు వచ్చి షూటింగులు చేసుకునేలా ఇక్కడ పరిశ్రమను అభివృద్ధి చేస్తాం అంటూ హామీ ఇచ్చారు. ఇటీవల బెనిఫిట్ షోలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత… సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలిపోనున్నదని కొందరు పుకార్లు పుట్టించిన నేపథ్యంలో ఇలాంటి హామీ కంటితుడుపు కూడా అవుతుంది.

అయితే ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వం ద్వారా ఏం బావుకుందామని వెళ్లారో గానీ.. రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ నుంచి ఏం పిండుకోదలచుకున్నారో స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నిర్మించదలచుకున్న యువభారత సమీకృత గురుకుల పాఠశాలలు కోసం సినిమా టికెట్లపై సెస్ విధించి వసూలు చేస్తాం అని ప్రకటించారు. బడుగు విద్యార్థుల కోసం ఈ ఏర్పాటు అన్నమాట. ప్రపంచస్థాయి నాణ్యతతో ఒక్కో స్కూలును 20-25 కోట్లతో నిర్మిస్తున్నాం అని.. సినిమా టికెట్లపై కొంత సెస్ రూపంలో వనరులు కావాలని పరిశ్రమ సహకరించాలని రేవంత్, భట్టి కోరారు.

రేవంత్ అనుసరిస్తున్నది ఇదేం నీతి అని ప్రజలు విస్తుపోతున్నారు. వెయ్యికోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, రేవంత్ సర్కారు లాంటి వాళ్లు టికెట్ ధరలు పెంచుకోమని అనుమతులు ఇవ్వడం వల్ల రెండు వేల కోట్లు సంపాదిస్తున్న సినిమాలు ఉన్నాయి. వాళ్లకేమో వేల కోట్లు ప్రజలనుంచి దండుకోవడానికి అనుమతులు ఇస్తున్నారు. అదే సమయంలో యువభారత సమీకృత గురుకుల పాఠశాలల కోసం ప్రతి సినిమా టికెట్ మీద సెస్ విధించాలనుకోవడం ఏం మంచి పద్ధతి.

చిన్న సినిమాల ప్రేక్షకులు, సామాన్య ప్రేక్షకులందరినించీ ఇలా పిండుకోవాలని చూడడం కరక్టేనా అంటున్నారు. దీనివల్ల చిన్న సినిమాలు దారుణంగా దెబ్బతింటాయనే వాదన కూడా వినిపిస్తోంది. సెస్ విధింపు కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం చేయడం బాగుంటుందని పలువురు కోరుతున్నారు.

7 Replies to “ఇదేం నీతి రేవంత్: రాయితీలు వారికి.. వడ్డింపు అందరికా?”

  1. వూరు పేరు లేని బ్రాండ్ లతో గత 5 ఏళ్ళు ఆంద్రప్రదేశ్ ప్రజల ర..క్తం పీల్చుకున్నారు కదరా..అప్పుడు అడగలేదేం సై…కో గాడిని?

  2. నిన్న జరిగిన మీటింగ్ తెలుగు సినిమా ను డెవలప్ చేయడానికి కాదు….నాశనం చేయడానికి.,..

  3. జనాలు స్వచ్చందంగా సినిమాలకు విపరీతమైన రేట్ లు పెట్టి చూడడం మానుకోవాలి. అపుడు కానీ సినిమా వాళ్ళు మామూలు మనుషులుగా ఆలోచిస్తారు. డబ్బు విపరీతంగా రావడం వలన కోట్లకు కోట్లు దానాలు చేస్తున్నారు. ఇలాంటి చావులు పదుల సంఖ్యలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలలో చనిపోయారు. వాళ్ళు రేవంత్ రెడ్డి కి కనపడలేదు సినిమా వాళ్లకు కనపడలేదు. ఫైనల్ గ బెనిఫిట్ షో లో ప్రీమియర్ షో లు బంద్ చేస్తారా లేదా రేట్ లు తగ్గిస్తారా. అంత సోది

  4. అందరూ ఒకటి కావాలనే మర్చి పోయినట్టు మాటాడన్నారు…అక్కడదీ తెలుగు చిత్రసీమే,అందులో ap భాగమే ఎక్కువ…తెలంగాణా వాళ్ళు డాష్ట్రం విపోయినప్పటినుంది పాడుతున్న రాగాలు చాలా ఉన్నాయి..అలాగే చాలా సినిమాలు వాళ్ళ యాసలోనే వస్తున్నాయి..పాత షారుక్ కాలం చెల్లిందని గ్రహించకుండా ఇంకా మెరుగులు దిద్దుకుంటు కనబడటానికి కింద మీద పడుటుంది…..

Comments are closed.