చెబితే విన‌డు… జ‌గ‌న్‌కు అర్థం కాదు!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సొంత పార్టీ నేత‌లు గుర్రుగా ఉన్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై సొంత పార్టీ నేత‌లు గుర్రుగా ఉన్నారు. తొంద‌ర‌ప‌డొద్ద‌ని ఆయ‌న‌కు చెప్పినా అర్థం కావ‌డం లేద‌ని వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, కొంద‌రు మాజీలు వాపోతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు విద్యుత్ చార్జీలనే తీసుకుందాం. విద్యుత్ చార్జీలు పెంచేది లేద‌ని, వీలైతే త‌గ్గిస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు.

అయితే ఆరు నెల‌ల పాల‌న‌లో మాట నిల‌బెట్టుకోవ‌డం ప‌క్క‌న పెడితే, చార్జీల పెంపుతో మోయ‌లేని విద్యుత్ భారాన్ని కూట‌మి ప్ర‌భుత్వం మోపుతోంది. ఇప్ప‌టికే రూ.6,072.86 కోట్లు భారం వేసింది. కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా మ‌రో రూ.9,412.50 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై మోప‌డానికి రంగం సిద్ధ‌మైంది. ఇందుకు నిర‌స‌గా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న చేప‌ట్ట‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు తాము ఇచ్చిన స‌ల‌హాను ప‌ట్టించుకోలేద‌ని వైసీపీ నేత‌లు వాపోతున్నారు. విద్యుత్ చార్జీల భారం బాధ‌ను ప్ర‌జ‌ల అనుభ‌వంలోకి వచ్చాక‌, కొంత కాలం పోనిచ్చి నిర‌స‌న చేప‌డితే వాళ్ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని జ‌గ‌న్‌కు వైసీపీ నేత‌లు స‌ల‌హా ఇచ్చారు. అయితే వాళ్ల స‌ల‌హాను ప‌ట్టించుకోక‌పోగా, ప్ర‌జ‌ల త‌ర‌పున మ‌నం క్షేత్ర‌స్థాయిలో పోరాటాలు చేయాల్సిందే అని జ‌గ‌న్ తెగేసి చెప్పిన‌ట్టు వైసీపీ నేత‌లు బాధ‌ప‌డుతున్నారు.

రాజ‌కీయాల్లో ఇంత తొంద‌ర‌పాటు అవ‌స‌రం లేద‌ని వైసీపీ సీనియ‌ర్ నేత‌లు చెబుతున్నా జ‌గ‌న్ వినిపించుకోలేద‌ని తెలిసింది. సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో కూడా ఇదే ర‌క‌మైన త‌ప్పు చేశార‌ని వైసీపీ నేత‌ల భావ‌న‌. అవ‌స‌రంలో ఉన్నోళ్ల‌కు ప్ర‌భుత్వం సాయం చేస్తే, కృత‌జ్ఞ‌త వుంటుందని, అలా కాకుండా కేవ‌లం రాజ‌కీయ కోణంలో చేస్తే, జేబులో వేసుకుంటారే త‌ప్ప‌, గుర్తు పెట్టుకోర‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో అదే అనుభ‌వంలోకి వ‌చ్చింద‌ని వారు అంటున్నారు.

రూ.15 వేల కోట్ల భారం మోయాలంటే జ‌నానికి చాలా ఇబ్బందిక‌ర‌మ‌ని, చంద్ర‌బాబు పాల‌నపై నెగెటివ్ ఏర్ప‌డ‌కుండా ఉండ‌ద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. అయితే ప్ర‌జ‌లు ఇంకా భారం బాధ‌ను అనుభ‌వించ‌క‌నే, పోరాటాల‌కు శ్రీ‌కారం చుడితే ప‌ద‌వీ కాంక్ష‌తో చేస్తున్నార‌నే నెగెటివ్ భావ‌న త‌మ‌పై ప‌డుతుంద‌ని వైసీపీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

18 Replies to “చెబితే విన‌డు… జ‌గ‌న్‌కు అర్థం కాదు!”

  1. మనిషి కో మాట.. గొడ్డుకో దెబ్బ..

    చెపితే వినినప్పుడు.. నాలుగు కొట్టి చూడు.. వింటాడేమో..

  2. అన్నాయ్, ఎందుకొచ్చిన తిప్పలు చెప్పు??

    జనాలు కోసం నువ్వు పోరాడడానికి వాళ్ళేమైనా ఓట్లేస్తారా చెప్పు??

    మనల్ని ఓడించిన ‘EVM ల మీద కదా పోరాడాలి??

    1. 2019లో మీరు ఈవీఎం ల మీద పోరాటం చేసి ఉంటే బాగుండేది . అప్పుడు తమరు గెలిచారు కాబట్టి పోరాటం చేయలేదు . ఇప్పుడు తమరు ఓడిపోయారు కాబట్టి ఈవీఎంల మీద పోరాటం చేస్తామంటున్నారు . వారెవ్వా ఏం రాజకీయం అండి ఇది. నీకైతే ఒక లెక్క అదే ఇతరులకు అయితే ఇంకో లెక్క నా.

      మనకు ఎన్ని సీట్లు రాకూడదు పొరపాటున వచ్చినయి అంత ఈవీఎంల మహిమ అని మీరు పోరాటం చేసి ఉంటే దానికి లెక్క ఉండేది.

    2. అయ్యా గ్యాస్ ఆంధ్ర

      ఈ విషయం మొత్తం ప్రపంచానికి తెలుసు కానీ తెలియనిది నీకు మీ అన్నకే . ఎందుకంటే ఆయన తంతా రివర్స్ పాలసీ కదా.

  3. కొత్త ప్యాలెస్ లో హాయిగా పండుకుని కళ్ళు మూసుకుంటే తన్నుకుంటూ వచ్చే అధికారానికి ఇంత తిప్పలు ఎందుకు చెప్పు అన్నాయ్??

  4. కేవలం మన అతి మంచితనం , అతి నిజాయితీ నే

    మనల్ని రేపు గెలిపించి కుర్చీ లో కుకోపెట్టి, శాలువ కప్పి, అవార్డు వచ్చేలాగ చేస్తుంది కదా?? ‘లేకి జనం కోసం ఇంత కష్టం అవసరమా చెప్పు అన్నాయ్??

  5. ఏ నాయకుడైనా…జనం తన వెనుక ఉండేట్టు చూసుకుంటాడు..ఇయ్యనకేమో అన్నిటికీ ఆత్రం..దెబ్బతిన్నాక అయినా జనం వెనుక నడవాలనే ఆలోచన లేదు..ఒక సారి జారి పడ్డవాడు వెనుకా ముందు చూసుకోవాలి కదా!

  6. పెంచను అనే కాకుండా తగ్గిస్తాను అని చెప్పి ఇలా పచ్చి మోసం దగా చేయగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు ఇది కచ్చితంగా కూటమి నయవంచన

  7. పెంచను అనే కాకుండా తగ్గిస్తాను అని చెప్పి ఇలా పచ్చి మోసం దగా చేయగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు ఇది కచ్చితంగా కూటమి నయవంచన

  8. పెంచను అనే కాకుండా తగ్గిస్తాను అని చెప్పి ఇలా పచ్చి మోసం దగా చేయగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు ఇది కచ్చితంగా కూటమి నయవంచన

Comments are closed.