సంక్రాంతి సినిమాల్లో ‘సంక్రాంతి’ ఫస్ట్

వదిలిన ప్రోమో ఫుల్ ఇంట్రస్టింగ్ గా వుంది. ప్రోమో ఎప్పుడైతే ఇంటస్ట్రింగ్ వుంటుందో కంటెంట్ కోసం జ‌నం చూస్తారు.

ఏమో ఒక్కోసారి తాబేలు గెలుస్తుంది. 2025 సంక్రాంతికి మూడు సినిమాలు వస్తుంటే, చివరిగా బరిలోకి దిగిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. నిజానికి ముందుగానే ప్రకటించిన సినిమా. కానీ గేమ్ ఛేంజ‌ర్ వచ్చి అక్కడ లాండ్ అవడంతో, వెంకీ-అనిల్ రావిపూడిల సినిమా వస్తుందా రాదా అని అనుమాన పడ్డారు. కానీ పంతం పట్టినట్లు పట్టి, సంక్రాంతి బరిలోకి వచ్చి కూర్చుంది. అప్పటికే గేమ్ ఛేంజ‌ర్, ఢాకూ మహరాజ్‌ సినిమాలు వున్నాయి. రెండూ క్రేజీ ప్రాజెక్ట్ లు. రామ్ చరణ్-శంకర్, బాలయ్య- బాబీ అంటే మామూలు కాంబినేషన్లు కాదు.

ఇలాంటి టైమ్ లో తన సినిమాను ముందుకు తోసేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి డిఫెరెంట్ పంథాను ఎన్నుకున్నాడు. తన పబ్లిసిటీ కంటెంట్ ను తనే డిజైన్ చేయడం ప్రారంభించాడు. వదిలే ప్రతి కంటెంట్ ఎలా వుంటుందన్నది తరువాత. ముందు అసలు కంటెంట్ మీద ఇంట్రస్ట్ కలిగించాలి అన్న కాన్సెప్ట్ పెట్టుకున్నారు.

తొలిసాంగ్ కు వింటేజ్‌ లుక్ తీసుకువచ్చి రమణ గోగుల చేత పాడించారు. భీమ్స్ ట్యూన్ అదిరింది. పాట చార్ట్ బస్టర్ కావడం కాదు, నెంబర్ వన్ ప్లేస్ లో నిల్చుంది. తరువాత వదిలిన మీనా.. మీనా పాట క్యాచీ ట్యూన్ తో ముందుకు వచ్చింది.

ఇప్పుడు రాబోయే సంక్రాంతి పాటను హీరో వెంకటేష్ చేత పాడించడం ఒక ముచ్చట. అదేమంత పెద్ద విషయం కాదు. కానీ దాని మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేయడానికి వదిలిన ప్రోమో ఫుల్ ఇంట్రస్టింగ్ గా వుంది. ప్రోమో ఎప్పుడైతే ఇంటస్ట్రింగ్ వుంటుందో కంటెంట్ కోసం జ‌నం చూస్తారు. కంటెంట్ ఏమాత్రం బాగున్నా ప్రోమో ప్లస్ అవుతుంది.

ఇలాంటి స్ట్రాటజీతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను సంక్రాంతి రేస్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి తోడు అటు గేమ్ ఛేంజ‌ర్, ఇటు ఢాకూ మహరాజ్ పబ్లిసిటీ ఇంకా ఊపు అందుకోవాల్సి వుంది.

One Reply to “సంక్రాంతి సినిమాల్లో ‘సంక్రాంతి’ ఫస్ట్”

Comments are closed.