రెండు వైపులా? డ్యామేజ్‌ కంట్రోల్?

డిసెంబర్ 5న మొదలైన అనుకోని ఇబ్బందికర పరిస్థితి నెల ముగిసేలోగానే సానుకూలంగా ముగిసింది.

టాలీవుడ్ జ‌నాలతో తెలంగాణ సిఎమ్ రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. బోలెడు మంది సినిమా జ‌నాలు వెళ్లారు. వెళ్లని వారూ వున్నారు. కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా తీసిన అభిషేక్ అగర్వాల్ నుంచి చురుగ్గా సినిమాలు తీస్తున్న చాలా మంది వెళ్లలేదు. పిలుపు అందలేదు అని కూడా అంటున్నారు. అదంతా వేరే సంగతి. వీళ్లు ఎందుకూ అని జ‌నం అనుకునే వారూ వెళ్లారు. టాలీవుడ్ పెద్దలు, సంఘాలు, వాటి లెక్కలు వాటికి వుంటాయి. అందువల్ల అదీ వేరే సంగతి.

గతంలో ఓసారి ఇలాగే టాలీవుడ్ టాప్ హీరోలు ఏపీకి వెళ్లి జ‌గన్‌ను కలిసి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి వెళ్లి జ‌గన్ కు నమస్కరించడం పెద్ద ట్రోలింగ్ మెటీరియల్ అయింది. చిరంజీవి లాంటి పెద్ద వయస్సు వున్న వారి చేత అలా దండాలు పెట్టించుకుంటారా అని తెగ గడబిడ అయింది. పైగా గేటు అవతల వాహనాలు దిగేలా చేసి, నడిపించారని యాగీ అయింది.

ఇప్పుడు ప్రభాస్, మహేష్ లాంటి టాప్ హీరోలు వెళ్లలేదు కానీ, వివిధ క్రాఫ్ట్ లకు చెందిన సెలబ్రిటీలు చాలా మందే వెళ్లారు. వారిలో రాఘవేంద్రరావు, మురళీమోహన్, అరవింద్, సురేష్ బాబు లాంటి పెద్ద వయస్సు వున్న వారు వున్నారు. వారు కూడా సిఎమ్ కు నమస్కరించారు. శాలువాలు కప్పారు.

ఇక్కడ జ‌గన్ అయినా, రేవంత్ అయినా, భవిష్యత్ లో లోకేష్, పవన్ అయినా, ఎవరైనా సరే, సిఎమ్ కుర్చీకి, పదవికి గౌరవించి నమస్కరించాలి. ఇది అర్థం కాక ‘అన్న దండం పెట్టాడు. తమ్ముడు పిండం పెట్టాడు’ లాంటి డైలాగులు వదలుతుంటారు.

సరే, అ ముచ్చట అలా వుంచితే, అసలు ఇప్పుడు అర్జంట్ గా టాలీవుడ్ పెద్దలు ఎందుకు కలిసినట్లు?

రేవంత్ రెడ్డి పదవీ స్వీకారం చేసి చాలా కాలం అయింది. అప్పుడు లేని తొందర ఇప్పుడు ఎందుకు వచ్చింది? సంధ్య థియేటర్ విషయంలోనా? లేదా రేట్లు, షో లు ఇవ్వము అన్నారనా? లేక మరేదైనా వుందా? అసలు పిలుపు ఇటు నుంచి వచ్చిందా? అటు నుంచి వచ్చిందా?

రాజ‌కీయ వర్గాల్లో దీని మీద చర్చ నడుస్తోంది. ఇదంతా రెండు వైపుల జ‌రిగిన డ్యామేజ్‌ కంట్రోల్ అనే మాట వినిపిస్తోంది.

సంధ్య థియేటర్ వ్యవహారంలో టాలీవుడ్ ఇమేజ్‌ కాస్త దెబ్బతిన్న మాట వాస్తవం. ఈ వ్యవహారంలో ప్రజ‌ల వైపు నుంచి కాస్త వ్యతిరేకతే వ్యక్తం అయింది. ముఖ్యంగా బన్నీ జ‌స్ట్ పాతిక లక్షలు ప్రకటించినపుడు, పరామర్శల లైవ్ కార్యక్రమం నడిచినపుడు మరింత వ్యతిరేకత వచ్చింది.

ఇదే వ్యవహారంలో ప్రభుత్వం కూడా కాస్త వ్యతిరేకతను మూటకట్టుకుంది. అయితే అది లోకల్ మీడియాలో కాదు, నేషనల్ మీడియాలో. బన్నీని అరెస్ట్ చేయడం అన్నది నేషనల్ మీడియా విషక్షంలో పెద్ద తప్పిదంగా కనిపించింది. దీన్ని కొందరు నేషనల్ మీడియాను మేనేజ్‌ చేసారు అని కూడా అన్నారు. కానీ అక్కడ అది నమ్మేందుకు అంతగా వీలు లేని సంగతి. భాజ‌పా ప్రో మీడియా బన్నీ వైపు నిల్చుంది అంటే కాస్త నమ్మేదిగా వుంటుంది.

అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఈ డ్యామేజ్‌ను కూడా కంట్రోలు చేసుకోవాల్సిన అవసరం సిఎమ్ రేవంత్ రెడ్డికి కొంత వుండి వుంటుంది.

అంటే ఇరు వైపులా కూడా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టి, డ్యామేజ్‌ను ఇక్కడితో ముగించి, మళ్లీ రెగ్యులర్ లైన్ లోకి వెళ్లాల్సి వుంది. అ నేపథ్యంలో రోగి పాలే కోరాడు, డాక్టర్ పాలే తాగమన్నాడు అనే టైపులో ఈ సమావేశం ఏర్పాటు చేసి వుంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

గమ్మత్తేమిటంటే సమావేశం నుంచి బయటకు వచ్చిన దిల్ రాజు, షో లు, రేట్లు పెద్ద విషయం కాదు. అసలు వాటి గురించి మాట్లాడలేదు అన్నారు. కానీ గతంలో ఏపీ సిఎమ్ జ‌గన్ దగ్గరకు అదే పెద్ద విషయం అని టాప్ హీరోలు అంతా కలిసి వెళ్లిన సంగతిని ఇప్పుడు జ‌నాలు గుర్తు చేసుకుంటున్నారు.

మొత్తానికి రేవంత్ రెడ్డి తన మనసులోని మాటలు సుమారు నలభై నిమిషాల పాటు సినిమా ప్రముఖులతో పంచుకున్నారు. వారికి రేవంత్ ప్రసంగం నచ్చింది. సినిమా జ‌నాలు అంతా కలిసి తన దగ్గరకు రావడం రేవంత్ కు నచ్చింది.

సిఎమ్ కు సినిమా ఇండస్ట్రీకి మధ్య ఏమీ లేదు. అంత ఊ.. ఉత్తుత్తినే అనే విధమైన వార్తలు ప్రచారంలోకి ఎలాగూ వస్తాయి.

మొత్తానికి డిసెంబర్ 5న మొదలైన అనుకోని ఇబ్బందికర పరిస్థితి నెల ముగిసేలోగానే సానుకూలంగా ముగిసింది.

15 Replies to “రెండు వైపులా? డ్యామేజ్‌ కంట్రోల్?”

  1. రాజ్యాంగం లోని ఏ అధికరణం చెబుతుంది సీ యమ్ సీటును గౌరవించాలని?

    అదే రాజ్యాంగం చెబుతోంది పాలకులు కేవలం సేవకులు అని.

  2. ఇక్కడ సదరు ఆర్టికల్ రాసినవారు గమనించాల్సిందిఏమిటంటే.. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం.. అది ఈ మీటింగ్ లో జరిగింది.. నమస్కారం పెట్టినప్పుడు చేతులు కట్టుకొని బోసినవ్వులు నవ్వలేదు రేవంత్ గారు

  3. State lo intha kanna pedda issues emi levaa?

    whats the urgency to have this meeting with such a short notice? Can’t it wait for few months like April -May?

    Looks like, Congress govt goes to shed forever.

  4. నమస్కారానికి ప్రతి నమస్కారం రేవంత్ రెడ్డి కూడా పెట్టాడు. కానీ మన ఎరుకుల రెడ్డి జగన్ మాత్రం ఎర్రి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఆ మాత్రం తేడా తెలుసుకో GA

  5. నమస్కారానికి ప్రతి నమస్కారం రేవంత్ రెడ్డి కూడా పెట్టాడు. కానీ మన ఎరుకులోడు ఎర్రి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఆ మాత్రం తేడా తెలుసుకో GA

  6. నమస్కారానికి ప్రతి నమస్కారం రేవంత్ రెడ్డి కూడా పెట్టాడు. కానీ మన జగన్ మాత్రం ఎర్రి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఆ మాత్రం తేడా తెలుసుకో GA

  7. నమస్కారానికి ప్రతి నమస్కారం రేవంత్ రెడ్డి కూడా పెట్టాడు. కానీ మన ఎ..రుకుల రె..డ్డి జగన్ మాత్రం ఎ..ర్రి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. ఆ మాత్రం తేడా తెలుసుకో GA

  8. బాబు GA మన కుళ్ళు రాతలు మానుకోవు కదా, నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది మన సంస్కారం అది కూడా లేదు కాబట్టే జగన్ గారిని అందరు విమర్శించారు

Comments are closed.